Dharmendra Pradhan: బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రసక్తే లేదు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పష్టీకరణ
ABN , Publish Date - Feb 21 , 2025 | 02:36 PM
దేశంలోని ఏ రాష్ట్రంపైనా హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విద్యావిధానంతో రాజకీయాలు వద్దని తమిళనాడు సీఎంకు లేఖ రాశారు.

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఎవరిపైనా బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాని తమిళనాడు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అయితే, విదేశీ భాషపై అధికంగా ఆధారపడుతున్న విషయాన్ని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఫలితంగా విద్యార్థులకు తమ మూలాలుపై అవగాహన తగ్గుతోందని అన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జాతీయ విద్యావిధానంలో ప్రయత్నం జరిగిందని వివరించారు. తమకు నచ్చిన భాషను ఎంచుకునే స్వేచ్ఛకు జాతీయ విద్యావిధానం ఎప్పుడూ మద్దతు తెలుపుతూనే ఉందని గుర్తు చేశారు (Tamilnadu).
DK Shiva Kumar: బెంగళూరు స్థితిని దేవుడు కూడా మార్చలేడు.. డీకే శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
రాజకీయ కారణాలతో జాతీయ విద్యావిధానాన్ని తమిళినాడులోని అధికార డీఎమ్‌కే పార్టీ వ్యతిరేకించడాన్ని ఆయన లేఖలో తప్పుబట్టారు. ఈ విధానంపై ప్రభుత్వం హస్త్రదృష్ఠితో వ్యాఖ్యలు చేస్తోందని, రాజకీయ లక్ష్యాల కోసం పురోగామి విధానాలను ప్రమాదాలుగా చూపించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. తమిళ భాష అజరామరమైనదని చెన్నైలో ప్రధాని అన్న మాటలను కూడా ఆయన గుర్తు చేశారు. తమిళ భాష, సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యవిధానంతో రాజకీయం వద్దని విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Rift in Mahayuti: మహారాష్ట్ర సీఎం కార్యక్రమాల్లో కానరాని డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే
అంతుకుమునుపు, తమిళనాడు సీఎం ప్రధాని రాసిన లేక ప్రకంపనలు సృష్టించింది. మూడు భాషల బోధనతో ఉన్న జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోతే కేంద్రం నిధులు వదులుకోవాల్సి వస్తుందంటూ ధర్మేంద్ర ప్రధాన్ హెచ్చరిక చేస్తున్నారని తమిళనాడు సీఎం లేఖలో పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తూ కేంద్రం రూ.2,154 కోట్ల నిధులను విడుదల చేయాలని అన్నారు. అయితే, ఈ లేఖపై కేంద్ర మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమిళాడు సీఎంకు ప్రత్యుత్తరమిచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి