Share News

Nitish Kumar: ఎన్నికల వేళ సీఎం హామీ.. 2030 నాటికి యువతకు కోటి ఉద్యోగాలు

ABN , Publish Date - Jul 13 , 2025 | 04:25 PM

2030 కల్లా కోటి ఉద్యోగాల కల్పనకు పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రైవేటురంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించి ఉపాధితా విస్తరణ ప్లానింగ్, అమలు కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

Nitish Kumar: ఎన్నికల వేళ సీఎం హామీ..  2030 నాటికి యువతకు కోటి ఉద్యోగాలు
Nitish Kumar

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) యువతను ఆకట్టుకునే కీలక హామీని ప్రకటించారు. 2030 నాటికి యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అక్టోబర్-నవంబర్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఎన్నికల తేదీలను ఎలక్షన్ కమిషన్ ప్రకటించాల్సి ఉంది.


2020-25 ఉద్యోగాల హామీపై ప్రగతి

తమ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను నితీష్ కుమార్ ప్రకటిస్తూ, 2020-25 సంవత్సరానికి 50 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యం పూర్తి కావడానికి అతి చేరువలో ఉన్నామన్నారు. ఇంతవరకూ 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, మరో 39 లక్షల మంది ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉపాధి పొందారని చెప్పారు.


2030 లక్ష్యం కోసం..

2030 కల్లా కోటి ఉద్యోగాల కల్పనకు పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రైవేటురంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు సంబంధించి ఉపాధితా విస్తరణ ప్లానింగ్, అమలు కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పనా జర్నీలో భాగంగా 2005, 2020 మధ్య 8 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. బీహార్‌ యువతకు ఉద్యోగాల కల్పన, సాధికారత కల్పించానికి తమ ప్రభుత్వం చిరకాలంగా కట్టుబడి ఉందని తెలిపారు.


స్కిల్ డవలప్‌మెంట్ యూనివర్శిటీ

స్కిల్ డవలప్‌మెంట్‌కు మరింత ఊతమిచ్చేలా సాత్ నిశ్చయ్ ఇనీషియేటివ్ కింద జననాయక్ కర్పూరి ఠాకూర్ స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్టు నితీష్ కుమార్ ప్రకటించారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, ఇండస్ట్రీ రెలివెంట్ శిక్షణకు ఒక వేదికగా ఈ యూనివర్శిటీ ఉంటుందని చెప్పారు.


దీనికి ముందు, 300 అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను నితీష్ ప్రకటించారు. బిహార్ నుంచి వలస వెళ్లి ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో ఉంటున్న వారి కోసం, ముఖ్యంగా పండుగ సీజన్లలో వీరి ప్రయాణాలకు వెసులుబాటు కల్పించేలా ఈ అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన బస్సుల్లో 75 ఏసీ, 74 ఏసీ బస్సులు కూడా ఉన్నాయి. ఇందుకోసం జూన్ 24న రూ.105.82 కోట్ల బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపారు. అదనంగా మరో 150 ఏసీ బస్సులను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిష్ (పీపీపీ) మోడల్‌లో ప్రవేశపెట్టనున్నామని నితీష్ చెప్పారు. పండుగ సీజన్లలో బిహార్ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వరాష్ట్రానికి చేరుకునేందుకు అదనపు ప్రత్యేక రైళ్లను నడపాలని కేంద్రాన్ని తమ ప్రభుత్వం కోరుతుందని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం.. 10 మందికి గాయాలు

భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిపోయిన రైలు..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 04:25 PM