Share News

TVK Vijay Party: టీవీకే పార్టీ జెండాలోని రంగుపై హైకోర్టులో కొత్త కేసు

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:07 PM

తమిళగ వెట్రి కళగం (టీవీకే) జెండాలో రంగులపై మద్రాసు హైకోర్టులో కొత్తగా కేసు దాఖలైంది. తొండై మండల సన్నోర్‌ ధర్మ పరిపాలన సభ అధ్యక్షుడు పచ్చయప్పన్‌ మద్రాసు హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌లో... తొండై మండల సన్నోర్‌ ధర్మ పరిపాలన సభ తమిళనాడు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ విభాగంలో నమోదుచేసి ట్రస్ట్‌గా పనిచేస్తుందన్నారు. ఈ సభ జెండా ఎరుపు, పసుపు రంగులతో రూపొందించామన్నారు.

TVK Vijay Party: టీవీకే పార్టీ జెండాలోని రంగుపై హైకోర్టులో కొత్త కేసు

చెన్నై: తమిళగ వెట్రి కళగం (టీవీకే) జెండాలో రంగులపై మద్రాసు హైకోర్టు(Madras High Court)లో కొత్తగా కేసు దాఖలైంది. తొండై మండల సన్నోర్‌ ధర్మ పరిపాలన సభ అధ్యక్షుడు పచ్చయప్పన్‌ మద్రాసు హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌లో... తొండై మండల సన్నోర్‌ ధర్మ పరిపాలన సభ తమిళనాడు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ విభాగంలో నమోదుచేసి ట్రస్ట్‌గా పనిచేస్తుందన్నారు. ఈ సభ జెండా ఎరుపు, పసుపు రంగులతో రూపొందించామన్నారు. అలాగే, 2023లో ట్రేడ్‌ మార్క్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ కూడా పొందామని,


nani3.2.jpg

ఆ ప్రకారం, నిర్ధిష్ట రంగులు వినియోగించే హక్కు తమకు మాత్రమే ఉందన్నారు. కానీ, నటుడు విజయ్‌(Actor Vijay) 2024లో ప్రారంభించిన టీవీకే జెండాలో ఎరుపు, పసుపు రంగులున్నాయని, అందువల్ల టీవీకే జెండాలోని రంగులు తొలగించేలా ఉత్తర్వులు జారీచేయాలని పిటిషన్‌లో కోరారు. కాగా, టీవీకే జెండాలోని ఏనుగు చిహ్నాలు తొలగించాలని ఇప్పటికే బీఎస్పీ దాఖలుచేసిన కేసు విచారణలో ఉండగా, తాజాగా టీవీకే జెండాలోని రంగులు తొలగించాలంటూ కొత్త పిటిషన్‌ దాఖలుకావడం గమనార్హం. ఈ పిటిషన్‌ త్వరలో విచారణకు రానుంది.


ఈ వార్తలు కూడా చదవండి.

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 17 , 2025 | 12:07 PM