Share News

PM Modi: మోదీ ఎందుకు రాజీనామా చేయలేదు

ABN , Publish Date - Jun 18 , 2025 | 04:23 AM

గుజరాత్‌లో 2002లో జరిగిన హత్యాకాండలో అన్ని మతాలకు చెందిన రెండు వేలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ.

PM Modi: మోదీ ఎందుకు రాజీనామా చేయలేదు

బీజేపీ నేతలకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రశ్న

బెంగళూరు, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): గుజరాత్‌లో 2002లో జరిగిన హత్యాకాండలో అన్ని మతాలకు చెందిన రెండు వేలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఎందుకు రాజీనామా చేయలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశ్నించారు. ఆర్‌సీబీ విజయోత్సవాల సమయంలో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం, ఉపముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆందోళనలు చేయడంపై ఆయన మండిపడ్డారు. బెంగళూరులో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... అప్పట్లో బీజేపీ అగ్రనేత, ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి సీఎం పదవికి రాజీనామా చేయాలని మోదీకి సూచించారని, అయినా మోదీ పాటించలేదని పేర్కొన్నా


పేలుడు పదార్థాలపై త్వరలో కొత్త చట్టం

న్యూఢిల్లీ, జూన్‌ 17: ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పేలుడు పదార్థాలకు సంబంధించి కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 141 ఏళ్ల క్రితం నాటి ఎక్స్‌ప్లోజివ్స్‌ యాక్ట్‌-1884ను రద్దు చేసి కొత్త చట్టాన్ని రూపొందించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రజలకు అందుబాటులో ఉంచింది. దీనిపై జులై 17లోగా అభిప్రాయాలు చెప్పాలని పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య శాఖ కోరింది. 1884లో ఆమోదించిన ఆ చట్టాన్ని 1978లో సమగ్రంగా సవరించారు. దాని ఆధారంగా పెద్ద, చిన్న సంస్థలు పేలుడు పదార్థాల తయారీ, అమ్మకం, ఎగుమతి,దిగుమతుల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

Updated Date - Jun 18 , 2025 | 04:25 AM