Share News

పెన్‌, పేపర్‌ విధానంలోనే నీట్‌

ABN , Publish Date - Jan 17 , 2025 | 05:02 AM

జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌-నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)-2025 నిర్వహణపరంగా ఓ స్పష్టత వచ్చింది.

పెన్‌, పేపర్‌ విధానంలోనే నీట్‌

  • ఒకేరోజు, ఒకే షిఫ్ట్‌లో నిర్వహణ.. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ వెల్లడి

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌-నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)-2025 నిర్వహణపరంగా ఓ స్పష్టత వచ్చింది. నీట్‌ను మునుపటి మాదిరిగానే పెన్‌, పేపర్‌ విధానం (ఓఎంఆర్‌)లో నిర్వహించనున్నారు. ఒకేరోజు, ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహిస్తారు. జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాల ప్రకారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. నీట్‌-2025ను ఓఎంఆర్‌ విధానంలో నిర్వహించాలా? కంప్యూటర్‌-బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో నిర్వహించాలా? అనే విషయంలో కేంద్ర విద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు నెలరోజులుగా మల్లగుల్లాలు పడ్డాయి.


ఈ మేరకు కేంద్రమంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన రెండుసార్లు సమావేశం కూడా నిర్వహించారు. చివరికి ఓఎంఆర్‌ విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఇతర వివరాల కోసం అభ్యర్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చని ఎన్టీఏ తెలిపింది.

Updated Date - Jan 17 , 2025 | 05:02 AM