Nanded Murder Case: నాందేడ్ పరువు హత్య కేసు.. యువతి తండ్రి అరెస్ట్
ABN , Publish Date - Dec 02 , 2025 | 08:20 AM
మహారాష్ట్రలో ఇటీవల ప్రియుడి మృతదేహాన్ని పెళ్లాడి తమ ప్రేమను నిరూపించుకుంది ఓ యువతి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పరువు హత్య కేసులో యువతి తండ్రి అరెస్ట్ అయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర(Maharashtra)లో ఇటీవల సంచలనం రేపిన ఓ యువకుడి హత్య కేసులో నిందితులుగా భావిస్తున్న యువతి తండ్రిని పోలీసులు అరెస్ట్(Arrested) చేశారు. అతడి కుమార్తె ఆ యువకుణ్ని ప్రేమించడం, కుటుంబ సభ్యులు నిరాకరించినా.. ఆమె వారించడంతోనే పరిస్థితులు హత్యకు దారితీసినట్టు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే?
నాందేడ్‌కు చెందిన ఆంచల్ మామిడ్వార్(Anchal Mamidwar) అనే యువతి.. సాక్షమ్ తాతే(Saksham Tate)తో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి వివాహం చేసుకుని జీవితాంతం ఉండాలనుకున్నారు. కానీ కులం అడ్డంకితో యువతి తల్లిదండ్రులు వీరి బంధాన్ని వ్యతిరేకించారు. ఇంతలో యువతి తండ్రి గజానన్ బాలాజి మామిడ్వార్(Gajanan Balaji Mamidwar), సోదరులు.. సాక్షమ్‌ను పలుమార్లు బెదిరించారు. అయినప్పటికీ వారిద్దరూ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇతర కులస్థులను వివాహమాడితే పరువుపోతుందని భావించిన ఆంచల్ కుటుంబ సభ్యులు.. సాక్షమ్‌ను హతమార్చాలని కుట్రపన్నారు. ప్లాన్ ప్రకారం.. నవంబర్ 27న అతడిపై దాడికి పాల్పడ్డారు. తొలుత తుపాకీతో కాల్చి, ఆ తర్వాత రాయితో మోది దారుణంగా చంపారు. విషయం తెలుసుకున్న ఆంచల్.. గుండెలవిసేలా రోదిస్తూనే.. సాక్షమ్ మృతదేహాన్ని వివాహమాడి తమ ప్రేమబంధాన్ని నిరూపించుకుంది. తన ప్రియుడి హత్యకు తండ్రి, సోదరులే కారణమని భావిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిందామె.
ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఆంచల్(Anchal) ఫిర్యాదు చేసింది. తమ ప్రేమ వ్యవహారం మొదలైనప్పటి నుంచీ సాక్షమ్ హత్య వరకూ జరిగిన సంఘటనంతా పోలీసులకు వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తండ్రిని అరెస్ట్ చేశారు. ఈ విషయమై ఆంచల్ స్పందిస్తూ.. 'నన్ను ఎంతగానో ప్రేమించిన వ్యక్తే లేడు. నా ప్రాణం కోసం నేను భయపడను. కానీ, సాక్షమ్ కుటుంబం ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది' అని అన్నారు. ప్రస్తుతం తన ఇంటికి వెళ్లనని శపథం చేసిన ఆమె.. సాక్షమ్ ఇంట్లోనే ఉంటానని చెప్పారు.
అయితే.. అంతకముందు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మృతుడు సాక్షమ్ తాతే(Saksham Tate)తో పాటు యువతి తండ్రి గజానన్ బాలాజి మామిడ్వార్, సోదరులు అంతా కలిసి డ్యాన్స్ చేశారు. అంబేడ్కర్ జయంతి వేడుకల్లో భాగంగా వారంతా ఇలా కలివిడిగా స్టెప్పులేయడం చూస్తుంటే సాక్షమ్‌తో యువతి కుటుంబ సభ్యులకు సన్నిహిత సంబంధాలున్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి: