Saif Ali Khan Stabbing Case: కత్తిపోట్లతో పట్టు సడలింది... సైఫ్ కీలక వాంగ్మూలం
ABN , Publish Date - Jan 24 , 2025 | 04:24 PM
సద్గురు శరణ్ నివాసంలోని 11వ ఫ్లోర్‌లో జరిగిన ఘటన, దుండగుడి దాడి నుంచి తన కుమారుడు, సిబ్బందిని కాపాడేందుకు తాను చేసిన ప్రయత్నం, ఏవిధంగా గాయపడింది సైఫ్ అలీఖాన్ వివరించారు.

ముంబై: జనవరి 16వ తేదీ తెల్లవారు జామున 2.30 గంటలకు తన నివాసంలోకి దుండగుడు చొరబడటం, అప్పటి దాడి ఘటనపై సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) పోలీసులకు వాంగూల్మం ఇచ్చారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే దాడికి పాల్పడిన 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను ముంబై పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సైఫ్ ఇంట్లో పలు చోట్ల కనుగొన్న ఫింగర్ ప్రింట్లు, షరీఫుల్ వేలిముద్రలు సరిపోయినట్టు గుర్తించారు. డక్ట్ పైప్, సైఫ్ కుమారుడు జహంగీర్ బెడ్రూమ్ డోర్ హ్యాండిల్ వద్ద ఫింగర్ ప్రింట్లను పోలీసులు సేకరించారు. శుక్రవారంనాడు సైఫ్ అలీ వాంగ్మూలాన్ని బాంద్రా పోలీసులు రికార్డు చేశారు.
Delhi Elections: ఎన్నికలకు మందే కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర.. సీఎం సంచలన వ్యాఖ్యలు
సద్గురు శరణ్ నివాసంలోని 11వ ఫ్లోర్‌లో జరిగిన ఘటన, దుండగుడి దాడి నుంచి తన కుమారుడు, సిబ్బందిని కాపాడేందుకు తాను చేసిన ప్రయత్నం, ఏవిధంగా గాయపడింది సైఫ్ వివరించారు. జహంగీర్ ఏడుపు, కేర్‌టేకర్ ఫిలిప్ గట్టిగా కేకలు వేయడంతో తాను గదినుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. ''నేను, కరీనా గదిలో ఉన్నాం. ఫిలిఫ్‌పే ఆగంతకుడు దాడి చేయడం చూశాను. దాంతో నేను అతనిపై పడి గట్టిగా పట్టుకున్నాను. అతను పరారయ్యేందుకు నా వీపు, మెడ, చేతులతో కత్తితో పొడిచాడు. దాంతో నా పట్టు సడలింది. అతన్ని ఎలాగైనా గదిలో బందించాలని తీవ్రంగా ప్రయత్నించాను'' అని సైఫ్ పోలీసులకు తెలిపారు. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో దాడి జరిగినట్టు ఆయన చెప్పారు.
కాగా, ఘటన అనంతరం సైఫ్ కుమారులు ఇబ్రహిం, తైమూర్‌లు సైఫ్‌ను ఆటోలో ఆసుపత్రికి తీసుకువెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. షెహజాద్ ఏడు నెలల క్రితమే బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడని, ముంబై రాకముందు, పశ్చిమబెంగాల్‌లో ఆధార్ డాక్యుమెంట్‌తో సిమ్ సంపాదించాడని తెలిపారు. విజయ్ దాసుగా తన పేరు మార్చుకున్నాడని చెబుతున్నారు. అయితే, షెహజాద్ న్యాయవాది మాత్రం పోలీసుల వాదనను తోసిపుచ్చారు. ఏడేళ్ల నుంచి నిందితుడు ముంబైలోనే తన కుటంబ సభ్యులతో ఉంటున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా
Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..
Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..
Read More National News and Latest Telugu News