Dalai Lama: దలైలామాకు భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి ఎంపీల లేఖ
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:44 PM
దలైలామా భారతరత్న నామినేషన్‌కు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టేందుకు పది మంది సభ్యుల కమిటీ ఏర్పాటయింది. ఇంతవరకూ వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 మంది ఎంపీల సంతకాలను సేకరించింది. రాబోయే రోజుల్లో దీనిని ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి సమర్పించనుంది.

న్యూఢిల్లీ: టిబెటన్ల ఆధ్యాత్మక గురువు దలైలామా (Dalai Lama)కు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న' (Bharat Ratna) ఇవ్వాలని కోరుతూ అల్ పార్టీ ఫోరమ్ కేంద్రానికి లేఖ రాసింది. పార్లమెంటు సంయుక్త సమావేశంలో దలైలామా ప్రసంగించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఆల్ పార్టీ ఇండియన్ పార్లమెంటరీ ఫోరం ఫర్ టిబెట్ ఈ లేఖను రాసింది. ఈ ఫోరంలో భారతీయ జనతా పార్టీ (BJP), బిజూ జనతాదళ్ (BJD), జనతాదళ్ యునైటెడ్ ఎంపీలు సైతం ఉన్నారు. ఈ నెలలో రెండుసార్లు సమావేశమైన ఫోరం ఏకగ్రీవంగా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించింది.
80 మంది ఎంపీలు సంతకం
దలైలామా భారతరత్న నామినేషన్‌కు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టేందుకు పది మంది సభ్యుల కమిటీ ఏర్పాటయింది. ఇంతవరకూ వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 మంది ఎంపీల సంతకాలను సేకరించింది. రాబోయే రోజుల్లో దీనిని ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి సమర్పించనుంది.
దీనిపై రాజ్యసభ ఎంపీ సుజీత్ కుమార్ మాట్లాడుతూ, దలైలామాకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ 80 మంది ఎంపీలు విజ్ఞానపత్రంపై సంతకాలు చేశారని, 100 మంది ఎంపీల సంతకాలు పూర్తికాగానే దానిని సమర్పిస్తామని చెప్పారు. సంతకాలు చేసిన వారిలో విపక్ష పార్టీల ఎంపీలు సైతం ఉన్నారని చెప్పారు. దలైలామాకు భారతరత్న ఇవ్వాలంటూ చేపట్టిన సంతకాల ప్రచారానికి పలువురు ఎంపీలు ముందుకు రాగా, కొందరు తమ ప్రచారానికి మద్దతు తెలుపుతూ వీడియో సందేశాలు పంపారని తెలిపారు. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి దలైలామా మాట్లాడేందుకు అనుమతించాలని కోరుతూ లోక్‌సభ, రాజ్యసభ స్పీకర్లకు లేఖలు రాయనున్నట్టు చెప్పారు. బౌద్ధమతాన్ని విసృతంగా ప్రచారం చేస్తున్న దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ప్రపంచ దేశాల నుంచి వేలాదిగా బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బాలికకు సీఎం యోగి హామీ.. లెక్కచెయ్యని స్కూలు యాజమాన్యం..
భయపెడుతున్న నిఫా వైరస్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి