Madhya Pradesh High Court: బానిసల్లా జిల్లా జడ్జిలు
ABN , Publish Date - Jul 27 , 2025 | 05:47 AM
జిల్లా జడ్జీలకు స్వేచ్ఛలేదని, వారు హైకోర్టు న్యాయమూర్తులను చూసి భయపడుతున్నారని మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీధరన్ తన తీర్పులో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

తీర్పులో మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీధరన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూలై 26: జిల్లా జడ్జీలకు స్వేచ్ఛలేదని, వారు హైకోర్టు న్యాయమూర్తులను చూసి భయపడుతున్నారని మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీధరన్ తన తీర్పులో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. శాఖాపరమైన చర్యలు తీసుకుంటారేమోనన్న భయంతో అర్హమైన కేసుల్లోనూ బెయిల్ ఇవ్వలేకపోతున్నారని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు ‘ఫ్యూడల్ లార్డ్’లుగా వ్యవహరిస్తూ జిల్లా స్థాయి జడ్జీలను ‘బానిసలు’గా చూస్తున్నారని ఆక్షేపించారు.
మధ్యప్రదేశ్‌లోని ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు జడ్జిని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని కొట్టివేస్తూ జస్టిస్ శ్రీధరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తగిన ఆధారాల్లేకుండానే జడ్జిని ఉద్యోగం నుంచి తొలగించారంటూ తప్పుపట్టారు. హైకోర్టు జడ్జిలు ‘సవర్ణులు’గా భావిస్తూ, జిల్లా స్థాయి న్యాయాధికారులను ‘శూద్రులు’గా చూస్తున్నారు’’ అని ఉపమానంగా చూపించారు.