Share News

Attack on Mother and Son: పనిమనిషి చేతిలో తల్లీకొడుకుల దారుణ హత్య

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:38 PM

రాత్రి 9:43 గంటలకు పోలీస్ స్టేషన్‌కు PCR కాల్ వచ్చింది. తాము లజ్‌పత్ నగర్లో ఉంటామని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన భార్య, కుమారుడు లిఫ్ట్ చేయడం లేదని 44 ఏళ్ల కుల్దీప్ అనే వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో హుటాహుటిన..

Attack on Mother and Son: పనిమనిషి చేతిలో తల్లీకొడుకుల దారుణ హత్య
Mother and son murder

న్యూఢిల్లీ, జులై 3: షాకింగ్.. సొంత పనిమనిషి చేతిలో తల్లీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఇంతకాలం వాళ్లకి నమ్మకంగా ఉంటూ వచ్చిన సదరు సర్వెంట్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 42 ఏళ్ల యజమానురాలు, ఆమె 14 ఏళ్ల కొడుకును గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఆ పనివాడు.

ఆగ్నేయ ఢిల్లీ DCP హేమంత్ తివారీ చెబుతున్న వివరాల ప్రకారం, 'జులై 2 రాత్రి 9:43 గంటలకు పోలీస్ స్టేషన్‌కు PCR కాల్ వచ్చింది. తాము లజ్‌పత్ నగర్లో ఉంటామని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన భార్య, కుమారుడు లిఫ్ట్ చేయడం లేదని 44 ఏళ్ల కుల్దీప్ అనే వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో హుటాహుటిన PCR, ఇంకా దర్యాప్తు అధికారి సదరు అడ్రస్‌కు చేరుకున్నారు. ఆ ఇంటి తలుపులు మూసివేసి ఉండగా గేటు, మెట్ల దగ్గర రక్తపు మరకలు ఉన్నాయి. ఇంతలో SHO టీమ్ కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. వీరంతా ఇంట్లోకి ప్రవేశించగానే రక్తపు మడుగులో ఓ మహిళ, బాలుడి మృతదేహాలు కనిపించాయి.


మృతులను రుచికా సెవానీ, ఆమె కుమారుడు 10వ తరగతి చదువుతున్న క్రిష్‌గా పోలీసులు గుర్తించారు పోలీసులు. రుచికాని బెడ్ రూంలో గొంతుకోసి హతమార్చగా.. ఆమె కుమారుడు క్రిష్ ను బాత్ రూంలో గొంతుకోసి చంపాడు నిందితుడు. రుచికా తన భర్తతో కలిసి వస్త్ర దుకాణం నిర్వహిస్తుండేవారు. బిహార్‌లోని హాజీపూర్‌కు చెందిన ముఖేష్‌ అనే యువకుడు ఆ షాప్ లో సహాయకుడు కమ్ డ్రైవర్‌గా పనిచేస్తూ నమ్మకంగా ఉంటున్నాడు. అయితే, ఉన్నట్టుండి బుధవారం రాత్రి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. తల్లీకుమారుడిని హత్యచేసి పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ముఖేష్‌ను పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

due-murder.jpg


ఈ వార్తలు కూడా చదవండి.

12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం!

రేవంత్‌.. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Jul 03 , 2025 | 05:34 PM