Mohan Bhagwat Delhi Meeting: మోహన్ భాగవత్‌తో ముస్లిం ప్రముఖుల భేటీ
ABN , Publish Date - Jul 25 , 2025 | 03:11 AM
వివిధ సమస్యల పరిష్కారానికి హిందూ, ముస్లిం మతాల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఇరు మతాల ప్రముఖులు...

రెండు మతాల మధ్య చర్చలు జరగాలని నిర్ణయం
న్యూఢిల్లీ, జూలై 24: వివిధ సమస్యల పరిష్కారానికి హిందూ, ముస్లిం మతాల మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఇరు మతాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ గురువారం ఇక్కడి హరియాణా భవన్‌లో నిర్వహించిన సమావేశంలో దీనిపై అంగీకారం కుదిరింది. ఈ సమావేశానికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ హాజరయ్యారు. ఆయన వెంట సీనియర్ నాయకులు కృషన్ గోపాల్, ఇంద్రేష్ కుమార్‌లు ఉన్నారు. ముస్లిం పక్షాన 60 ప్రముఖ ఇమామ్‌లు, ముఫ్తీలు, మదర్సాల మొహత్‌మిమ్‌లు పాల్గొన్నారు. మూడున్నర గంటల పాటు చర్చలు కొనసాగాయి. జాతీయ అంశాలపై చర్చలు జరిగాయని ఇమామ్‌ల ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ చెప్పారు. మందిరాలు-మసీదులు, పూజారులు-ఇమామ్‌లు, గురుకులాలు-మదర్సాల మధ్య తరచూ సంభాషణలు జరుగుతుండాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనిని ఇమామ్ ఆర్గనైజేషన్-ఆరెస్సెలు ముందుకు తీసుకెళ్తాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‌లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News