Share News

Political Record: ఇందిరా గాంధీ రికార్డును అధిగమించిన మోదీ

ABN , Publish Date - Jul 26 , 2025 | 03:04 AM

ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనతను సాధించారు. అత్యధిక కాలంపాటు పదవిలో కొనసాగిన రెండో ప్రధానిగా ఇందిరాగాంధీ..

Political Record: ఇందిరా గాంధీ రికార్డును అధిగమించిన మోదీ

  • ప్రధానిగా 4,078 రోజుల పాటు పదవిలో

న్యూఢిల్లీ, జూలై 25: ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనతను సాధించారు. అత్యధిక కాలంపాటు పదవిలో కొనసాగిన రెండో ప్రధానిగా ఇందిరాగాంధీ పేరుతో ఉన్న రికార్డును ఆయన శుక్రవారం అధిగమించారు. ఇందిరాగాంధీ 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు ఏకధాటిగా 4,077 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ప్రస్తుతం మోదీ శుక్రవారం నాటికి 4,088 రోజుల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఓటమిని ఎరగకుండా అత్యధిక కాలం పాటు పదవిలో కొనసాగారు. వరుసగా మూడుసార్లు కాంగ్రె్‌సకు విజయం సాధించిపెట్టారు. 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు మొత్తం 6,130 రోజులు పదవిలో కొనసాగారు. ప్రస్తుతం ఆ తర్వాతి స్థానంలో మోదీ ఉన్నారు. పదవిలో కొనసాగుతూ వరుసగా బీజేపీని గెలిపిస్తున్న రాజకీయ నాయకునిగా ఇప్పటికే మోదీ ఘనత సాధించారు. ఆయన 2002, 2007, 2012ల్లో జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ప్రఽధాని పదవిని చేపట్టారు. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోలేదు. వరుసగా ఆరు ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా, పీఎంగా కొనసాగిన ఏకైక నాయకుడు మోదీయే కావడం విశేషం. ప్రధానిగా రెండు టర్ములు పూర్తి చేసుకున్న కాంగ్రెసేతర నేత కూడా ఆయనే కావడం మరో విశేషం.


ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 03:04 AM