Union Cabinet: రూ.16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం ఓకే
ABN , Publish Date - Jan 29 , 2025 | 04:33 PM
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వావలభనం సాధించడం, ఖనిజాల దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం కేంద్రం లక్ష్యమని అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా అధిగమించేందుకు ప్రభుత్వం గత రెండేళ్లుగా పలు చర్యలు తీసుకుందన్నారు.

న్యూఢిల్లీ: క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వయంసమృద్ధి లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.16,300 కోట్ల వ్యయంతో ఈ మిషన్ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
PM Modi: నేను తాగుతున్న నీళ్లు కూడా అవే... ఆప్‌పై మోదీ నిప్పులు
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వావలభనం సాధించడం, ఖనిజాల దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం కేంద్రం లక్ష్యమన్నారు. ఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా అధిగమించేందుకు ప్రభుత్వం గత రెండేళ్లుగా పలు చర్యలు తీసుకుందన్నారు. ఈ రంగంలో స్వావలంభన సాధించాలనే విజన్‌కు అనుగుణంగా 2024-25 బడ్జెట్‌లో క్రిటికల్ మినరల్ మిషన్ ఏర్పాటును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని గుర్తు చేశారు. అరుదైన ఖనిజ వనరులు ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచుకోవడం, దేశీయంగా ఖనిజ నిల్వల అభివద్ధికి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటీ కంపెనీలను నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ప్రోత్సిహిస్తుందని మంత్రి చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News