Satyendra Jain: సత్యేంద్ర జైన్ ప్రాసిక్యూషన్‌ను రాష్ట్రపతి అనుమతి కోరిన హోం శాఖ
ABN , Publish Date - Feb 14 , 2025 | 02:44 PM
హవాలా లావాదేవీల ఆరోపణలపై మనీ లాండరింగ్ కేసు కింద జైన్‌ను 2022 మేలో ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం బెయిలుపై ఉన్న ఆయనపై ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra Jain) మరింత చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి మంజూరు చేయాలంటూ రాష్ట్రపతిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) కోరింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 218 కింద అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈడీ విచారణలో తగినన్ని సాక్ష్యాలు లభించినట్టు తెలిపింది. హవాలా లావాదేవీల ఆరోపణలపై మనీ లాండరింగ్ కేసు కింద జైన్‌ను 2022 మేలో ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం బెయిలుపై ఉన్న ఆయనపై ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది.
Minister: మంత్రిగారు యమ ధీమాగా ఉన్నారే.. కూటమిని ఓడించడం ఎవరితరం కాదులే..
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై జైన్ తదితరులపై సీబీఐ 2017 ఆగస్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2018 డిసెంబర్‌లో ఛార్జిషీటు దాఖలు చేసింది. 2015-17 మంది ఆయన ఆదాయ మార్గాల కంటే 217 శాతం హెచ్చుగా ఆదాయం కలిగి ఉన్నారని, రూ.1.47 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయని సీబీఐ ఆ ఛార్జిషీటులో పేర్కొంది.
మనీలాండరింగ్ కేసులో సుదీర్ఘ కాలం జైలులో ఉండటంతో సత్యేంద్ర జైన్‌కు సిటీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. దీంతో గత ఏడాది అక్టోబర్ 18 ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పించారు. 2022 మేలో జైన్ అరెస్టు కాగా, 2023 మే 26, 2024 మార్చి 18 మధ్య 10 నెలలు మెడికల్ బెయిల్ మినహా తక్కిన కాలమంతా ఆయన జైలులోనే ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సత్యేంద్ర జైన్ బీజేపీ అభ్యర్థి కర్నైల్ సింగ్ చేతిలో 21,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ఇవి కూడా చదవండి...
PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు
Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.