Share News

MCD Elections 2025: ఢిల్లీ మేయర్‌ పీఠం బీజేపీ కైవసం.. రాజా ఇక్బాల్ సింగ్ గెలుపు

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:48 PM

విడివిడిగా ఉన్న ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ), సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ)ను 2022 మే 22న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పేరుతో విలీనం చేశారు.

MCD Elections 2025: ఢిల్లీ మేయర్‌ పీఠం బీజేపీ కైవసం.. రాజా ఇక్బాల్ సింగ్ గెలుపు

న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) తిరిగి బీజేపీ (BJP) కైవసం అయింది. ఎంసీడీ కొత్త మేయర్‌గా బీజేపీ నేత రాజా ఇక్బాల్ సింగ్ (Raja Iqbal Singh) శుక్రవారంనాడు ఎన్నికయ్యారు. సింగ్‌కు 133 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 8 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లలేదు. మొత్తం 142 ఓట్లు పోలయ్యారు. ఆప్ ఈ ఎన్నికలను బహిష్కరించింది.

National Herald case: సోనియా, రాహుల్‌కు నోటీసుల జారీకి కోర్టు నిరాకరణ


డిప్యూటీ మేయర్ సైతం బీజేపీకే

బీజేపీ అభ్యర్థి జై భగవాన్ యాదవ్ డిప్యూటీ మేయర్‌గా శుక్రవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి అరిబా ఆసిఫ్ ఖాన్ తన నామినేషన్ ఉపంసహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. డిప్యూటీ మేయర్ పోస్టుకు బీజేపీ తమ అభ్యర్థిగా బేగంపూర్ వార్డు‌కు చెందిన యాదవ్‌ను నామినేట్ చేసింది.


కాగా, ఇంతకు ముందు మేయర్ పోస్ట్ ఆప్ చేతిలో ఉంది. మూడు ఓట్ల తేడాతో ఆప్ మేయర్ అభ్యర్థిగా మహేష్ కుమార్ ఖించి 2024 నవంబర్‌లో ఎన్నికయ్యారు. విడివిడిగా ఉన్న ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ), సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ)ను 2022 మే 22న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పేరుతో విలీనం చేశారు.


ఇవి కూడా చదవండి..

Pahalgam Attack: ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలపై పోలీసులు ఆంక్షలు

Exercise Aakraman: ఎల్ఓసీ సమీపంలో భారత వాయుసేన 'ఎక్సర్‌సైజ్ ఆక్రమణ్'

Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. ఎమ్మెల్యే అరెస్ట్

For National News And Telugu News

Updated Date - Apr 25 , 2025 | 04:50 PM