Masood Azhar Location: గిల్గిట్ బాల్టిస్థాన్‌లో మసూద్ అజార్
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:07 AM
భారత్‌కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైష్ ఎ మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పాక్ ఆక్రమిత కశ్మీర్.

న్యూఢిల్లీ, జూలై 18: భారత్‌కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైష్-ఎ-మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో తలదాచుకుంటున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన చేపట్టిన సమయంలో మసూద్ బహావల్‌పూర్‌లో ఉండగా.. క్షిపణి దాడుల్లో అతని కుటుంబ సభ్యులు చనిపోయిన విషయం తెలిసిందే..! ఆ తర్వాత అతని జాడ తెలియలేదు. అయితే.. తాజాగా బహావల్‌పూర్ నుంచి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండే గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో మసూద్ కనిపించినట్లు భారత నిఘావర్గాలు గుర్తించాయి. గిల్గిట్-బాల్టిస్థాన్‌లోని స్కార్డ్ నగరంలోని సద్‌పారా రోడ్డులో మసూద్ కనిపించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి