Top Maoist Leader dead: జార్ఖండ్ ఎన్‌కౌంటర్‌లో కీలక నేత మృతి.. అతని బ్యాక్‌గ్రౌండ్ ఇదే
ABN , Publish Date - Apr 21 , 2025 | 03:08 PM
Top Maoist Leader dead: జార్ఖండ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కీలక నేత హతమయ్యాడు. అతడిపై కోటి రూపాయల రివార్డు ఉంది.

జార్ఖండ్, ఏప్రిల్ 21: జార్ఖండ్ ఎన్‌కౌంటర్‌లో మావోలకు ఊహించని రీతిలో ఎదరుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని బొకారో జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. లాల్ పానియా దగ్గర కోబ్రా 209 బెటాలియన్ సైనికులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు అగ్రనేతలను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఎన్‌కౌంటర్‌లో అరవింద్ యాదవ్, సాహెబ్ రామ్ మాంఝీ, ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ మృతి చెందారు. వీరిలో ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా వివేక్ కొనసాగుతున్నారు. వివేక్‌పై కోటి రూపాయలపైగా రివార్డు ఉంది. ఇతడిని ఫుచన, నాగ మాంఝీ, కరన్, లెతర అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇక ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మరో ఇద్దరు అరవింద్ యాదవ్, సాహెబ్ రామ్ మాంఝీపై కూడా రివార్డులు ఉన్నాయి. ఇద్దరిపై రూ.10 లక్షల చొప్పుల రివార్డులు ఉన్నాయి.
ప్రయాగ్ గురించి...
ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ స్వగ్రామం ధనాబాద్ జిల్లా తుండీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దల్‌బుద్. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో జరిగిన 100 దాడుల్లో ప్రయాగ్ కీలక పాత్ర పోషించాడు. ప్రశాంత్ హిల్స్ కేంద్రంగా మాంఝీ తన కార్యకలాపాలను నిర్వహించేవాడు. అయితే జార్ఖండ్‌లో అత్యధికంగా రివార్డ్ ఉన్న రెండో మావోయిస్టు నేత ప్రయాగ్. మాంఝీతో పాటు మరో నలుగురిపై కూడా కోటి రూపాలయపైనే రివార్డులు ఉన్నాయి. ప్రయాగ్ గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతబలగాలు అతడి కోసం వేట కొనసాగించాయి. ఈరోజు ఉదయం లాల్ పానియా దగ్గర మావోయిస్టులు ఎదురు పడటంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పది మందికి పైగా మావోయిస్టులు హతమవగా.. మరికొంతమంది మావోయిస్టులు పారిపోయారు. మొత్తం ఎనిమిది మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రయాగ్ మాంఝీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Karnataka:కుమార్తె అలా చేయడం వల్లే.. హత్యకు గురైన మాజీ డీజీపీ.. కీలక విషయాలు వెలుగులోకి..
ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఏకే 47, ఎస్‌ఎల్ఆర్, ఇన్సాస్, రైఫిల్స్‌తో పాటు మందుగుండు సామాగ్రిని సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం కాల్పులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఏడాది క్రితమే ప్రయాగ్ భార్య జయను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. క్యాన్సర్ బాధపడుతున్న ఆమె చికిత్స కోసం వచ్చిన సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత చికిత్స పొందుతూ క్యాన్సర్‌తో ప్రయాగ్ భార్య మృతి చెందింది.
ఇవి కూడా చదవండి
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Jharkhand Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి
Read Latest National News And Telugu News