Share News

Manish Kashyap: ప్రశాంత్ కిషోర్ గూటికి మనీష్ కశ్యప్

ABN , Publish Date - Jul 07 , 2025 | 06:58 PM

మనీష్ కశ్యప్‌కు డిజిటల్ ఫాలోయింగ్ ఉంది. ఆయన యూట్యూబ్ ఛానెల్‌కు దాదాపు కోటి మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తమిళనాడులో బిహారీ వలసదారుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ కొద్ది సంవత్సరాల క్రితం ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేశారనే కారణంగా కశ్యప్‌ను అరెస్టు చేశారు.

Manish Kashyap: ప్రశాంత్ కిషోర్ గూటికి మనీష్ కశ్యప్
Manish Kashyap

పాట్నా: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మనీష్ కశ్యప్ (Manish Kashyap) తన మద్దతుదారులతో కలిసి ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) సారథ్యంలోని 'జన్ సురాజ్' (Jan Suraaj) పార్టీలో చేరారు. పాట్నాలో ఆదివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రశాంత్ కిషోర్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. మనీష్ కశ్యప్ నెలరోజుల క్రితం భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు.


మనీష్ కశ్యప్‌కు డిజిటల్ ఫాలోయింగ్ ఉంది. ఆయన యూట్యూబ్ ఛానెల్‌కు దాదాపు కోటి మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తమిళనాడులో బిహారీ వలసదారుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ కొద్ది సంవత్సరాల క్రితం ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేశారనే కారణంగా కశ్యప్‌ను అరెస్టు చేశారు. దాంతో ఒక్కసారిగా ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆయనపై ఈ వివాదంపై ఉన్నప్పటికీ ఒక వర్గం యూత్‌లో, ముఖ్యంగా బీహార్‌లో ఆయన పాపులాటరీ పెరిగింది.


గత నెలలో రిజైన్

కశ్యప్ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అయితే ఆయనకు ఎన్నికల్లో పోటీకి పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. గత ఏడాది జూన్‌లో ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఓ వీడియో మెసేజ్‌లో ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ మైలేజీ కోసం బీజేపీ తన పేరు ఉపయోగించుకుని, ఆ తర్వాత పక్కనపెట్టేసిందని ఆరోపించారు. బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

పిల్లలతోటే మా ప్రపంచం: బంగ్లా ఖాళీ జాప్యంపై మాజీ సీజేఐ చంద్రచూడ్

దలైలామాకు భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి ఎంపీల లేఖ

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 07 , 2025 | 06:59 PM