Manda Krishna: రాష్ట్రపతిని కలవనున్న మందకృష్ణ.. ఎందుకంటే
ABN , Publish Date - Nov 18 , 2025 | 02:07 PM
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై దాడికి నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు చేశామని మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ విషయంపై రాష్ట్రపతిని కలుస్తామన్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 18: చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై జరిగిన దాడి విషయాన్ని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామన్నారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాశామని చెప్పారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై దాడి జరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన చేశామన్నారు. గల్లీ నుంచి ఉద్యమాన్ని ఢిల్లీ దాకా తీసుకువచ్చామని ఆయన చెప్పారు.
రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థలు విధి నిర్వహణలో విఫలం అయ్యాయని.. నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. నిర్లక్ష్యం వహిస్తున్న వ్యవస్థలను సరిచేయాల్సిన బాధ్యత రాష్ట్రపతిదే అని వెల్లడించారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత రాష్ట్రపతి దే అని అన్నారు. రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థలు విఫలమవుతున్నప్పుడు రాజ్యాంగ పరిరక్షకురాలుగా వ్యవస్థలపై చర్యలు తీసుకోవడానికి అధికారం రాష్ట్రపతికే ఉంటుందని వెల్లడించారు.
సీజేఐపై జరిగిన దాడిని ప్రపంచం చూసిందన్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో ప్రమాణస్వీకారం చేయించింది రాష్ట్రపతి అని అన్నారు. వ్యవస్థలను సరిచేసి దళితులకు న్యాయం చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవు
కుట్ర చేసే బయటకు పంపారు.. కవిత సంచలన వ్యాఖ్యలు
Read Latest National News And Telugu News