Man Bites Wife's Nose: అప్పు గొడవ.. భార్య ముక్కు కొరికేసిన భర్త
ABN , Publish Date - Jul 11 , 2025 | 08:52 PM
భర్త హామీ ఉండటంతో భార్య ఒకరి దగ్గర అప్పు తీసుకుంది. అయితే, భార్య అప్పు తీర్చకుండా కాలయాపన చేస్తోంది. అప్పుల వాళ్లు మీదపడుతుండటంతో భర్త ఆగ్రహంతో ఊగిపోయి భార్య ముక్కూడిపోయేలా కొరికేశాడు.

బెంగళూరు: కర్ణాటకలోని దావణగెరెలో ఒక భర్త తన భార్య ముక్కు కొరికేశాడు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విషయంలో భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదం ఈ ఘటనకు దారితీసింది.
ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే, విద్య అనే మహిళ తన భర్త విజయ్ పూచీకత్తుతో అప్పు తీసుకుంది. అయితే, ఆమె రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైంది. అప్పు ఇచ్చిన వాళ్లు విద్య, ఆమె భర్త విజయ్.. ఇద్దరినీ వేధించడం ప్రారంభించారు. ఫలితంగా కొంతకాలంగా దంపతుల మధ్య వాగ్వాదం జరుగుతోంది.
అయితే, ఈ వివాదం తీవ్రంగా మారి భార్యాభర్తలు కొట్టుకునే స్థాయికి చేరింది. దీంతో ఆగ్రహంతో ఉన్న విద్య భర్త కోపంతో తన భార్య ముక్కుని కొరికేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై విద్య కింద పడిపోయింది. అనంతరం కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకుని హుటాహుటీన విద్యను చన్నగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విద్య ముక్కు తెగిపోయిందని, అయితే, ఇప్పుడు ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఈ క్రమంలో విద్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విజయ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. శివమొగ్గలోని జయనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుకాగా, స్టేషన్ లిమిట్స్ కారణంగా, కేసును దావణగెరె జిల్లాలోని చన్నగిరి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!
అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు
For Telangana News And Telugu News