Mahatma Gandhi: బీర్ టిన్స్‌పై బాపూజీ బొమ్మ.. రష్యా కంపెనీ నిర్వాకం
ABN , Publish Date - Feb 15 , 2025 | 09:09 PM
రాజకీయ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందిని సత్పతి మనుమడు సుపర్నో సత్పతి దీనిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ, రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిని దృష్టికి ఈ అంశాన్ని తీసుకు వెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.

న్యూఢిల్లీ: రష్యాకు చెందిన ఒక బ్రూవరీ కంపెనీ చేసిన నిర్వాకం సంచలనమైంది. ఆ కంపెనీ తమ బీర్ టిన్స్ (Beer Cans)పై భారత జాతిపిత మహాత్మాగాంధీ (Mahatma Gandhi) ఫోటోను ముద్రించింది. 'మహాత్మ జి' అనే లేబుల్ దీనిపై ఉంది. రష్యా బ్రాండ్ రీవార్ట్ ఈ బీర్లను తయారు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో రావడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందిని సత్పతి మనుమడు సుపర్నో సత్పతి దీనిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ, రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిని దృష్టికి ఈ అంశాన్ని తీసుకు వెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.
Ranveer Allahbadia: రణ్‌వీర్ తరఫున వాదిస్తున్న లాయర్ ఎవరో తెలుసా?
''మోదీజీ... మీ మిత్రుడైన రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకు వెళ్లండి. గాంధీజీ పేరుతో రష్యా రీవార్ట్ కంపెనీ బీర్లు అమ్ముతోంది" అని సుపర్ణో సత్పతి సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై వెంటనే స్పందనలు వ్యక్తమవుతున్నాయి. గాంధీని అవమాన పరచేలా రష్యా బీర్ కంపెనీ చర్య ఉందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఇదెంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఒక నెటిజన్ మండిపడ్డాడు. ''గాంధీ పేరును వాడుకోవడం ఆపండి..ఆల్కహాల్ బొమ్మతో అమ్ముకోండి'' అని మరో యూజర్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.
ఇదే మొదటిసారి కాదు..
2019లోనూ ఇజ్రాయెల్‌కు చెందిన ఒక కంపెనీ మద్యం బాటిళ్లపై గాంధీజీ బొమ్మను ముద్రించడం వివాదమైంది. ఇజ్రాయెల్ 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కంపెనీ ఈ చర్యకు పాల్పడింది. ఈ అంశం భారత పార్లమెంటు ముందుకు రావడం, రాజ్యసభ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో సదరు సంస్థ ఆ తర్వాత భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పింది.
ఇవి కూడా చదవండి...
US Deportation Flights: భారత్‌కు మరో వలసదారుల విమానం.. ఏయే రాష్ట్రాల వారు ఉన్నారంటే..
Special Vande Bharat Train: నేటి నుంచి ప్రయాగ్‌రాజ్‌కి ప్రత్యేక వందే భారత్ రైలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.