Maharashtra: అసెంబ్లీలో విపక్ష నేత హోదా మాకు ఇవ్వాలి: సంజయ్ రౌత్
ABN , Publish Date - Mar 01 , 2025 | 06:44 PM
మహారాష్ట్ర అసెంబ్లీలో 10 శాతం సీట్లు లేకున్నా కూడా గతంలో విపక్ష పార్టీలకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లభించిన సందర్భాలు ఉన్నాయని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు.

ముంబై: మహారాష్ట్ర శాసనసభలో (Legislative Assembly) తమ పార్టీకి విపక్ష నేత హోదా ఇవ్వాలని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) డిమాండ్ చేసారు. మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 3 నుంచి 26 వరకూ జరుగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీలో 10 శాతం సీట్లు లేకున్నా కూడా గతంలో విపక్ష పార్టీలకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లభించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. 288 మంది సభ్యుల అసెంబ్లీలో విపక్షాల బలం సుమారు 50 వరకూ ఉన్నట్టు ఆయన తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న తమ విజ్ఞప్తికి స్పీకర్ ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
Amit shah: మణిపూర్‌లో శాంతిభద్రతలపై సమీక్ష.. అమిత్‌షా కీలక ఆదేశాలు
మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన (యూబీటీ)కి 20 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 16 మంది ఎమ్మెల్యేలు, శరద్‌పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీకి 10 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాగా, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను శివసేన (యూబీటీ) కోరితే, శాసనమండలిలో ప్రతిపక్ష హోదాను తాము కోరనున్నట్టు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం శాసన మండలిలో శివసేన (యూబీటీ)నేత అంబదాస్ దాన్వే విపక్ష నేతగా ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం 2024 ఆగస్టుతో ముగిసింది.
మోహన్ భగవత్‌ను ఫాలో అవుతున్నాం...
ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల ముగిసిన మహాకుంభమేళాకు పార్టీ నేతలు దూరంగా ఉండటంపై మీడియా అఢిగిన ప్రశ్నకు సంజయ్ రౌత్ స్పందిస్తూ, తాము ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను ఉదాహరణగా తీసుకున్నట్టు చెప్పారు. ''మహాకుంభ్‌కు మోహన్ భగవత్ హాజరయినట్టు నేను చూడలేదు. మేము ఆయన కోసం వేచిచూశాం. అయితే ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతలెవరూ అక్కడ మాకు కనిపించలేదు'' అని సంజయ్ రౌత్ సమాధానమిచ్చారు.
ఇవి కూడా చదవండి
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.