Share News

MLA Sanjay Gaikwad:దక్షిణాది వారు డ్యాన్స్‌ బార్లను నడుపుతారు

ABN , Publish Date - Jul 11 , 2025 | 05:13 AM

దక్షిణ భారతీయులపై శివసేన శిందే వర్గం ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

MLA Sanjay Gaikwad:దక్షిణాది వారు డ్యాన్స్‌ బార్లను నడుపుతారు

  • పిల్లల్ని చెడగొడతారు.. మహారాష్ట్రలో

  • శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

  • ఖండించిన సీఎం ఫడణవీస్‌, ఏక్‌నాథ్‌ శిందే

ముంబై, జూలై 10: దక్షిణ భారతీయులపై శివసేన(శిందే వర్గం) ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుల్దానా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్‌.. ముంబైలోని తన అధికారిక నివాసంలో పనిచేస్తున్న క్యాంటీన్‌ కాంట్రాక్టర్‌ను తీవ్రంగా కొట్టారు. పాచిపోయిన ఆహారం ఇచ్చారంటూ ఆయన పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన వీడియో బుధవారం నెట్టింట వైరల్‌ అయ్యింది. పప్పు ఉన్న కటోరాను కాంట్రాక్టర్‌ ముక్కు వద్ద పెట్టిన గైక్వాడ్‌.. ఆ వెంటనే అతనిపై ముష్టిఘాతాలు కురిపించారు. సదరు కాంట్రాక్టర్‌ కింద పడిపోయి.. లేవలేని స్థితిలో ఉన్నా.. తన దాడిని ఆపలేదు. దీనిపై గైక్వాడ్‌ గురువారం స్పందిస్తూ.. వివాదాన్ని మరింత తీవ్రం చేశారు. ‘‘దక్షిణ భారతీయులు డ్యాన్స్‌ బార్లు, లేడీస్‌ బార్లను నడుపుతూ.. మహారాష్ట్ర సంస్కృతిని నాశనం చేస్తున్నారు. శెట్టి అనే దక్షిణాది వ్యక్తికి కాంట్రాక్ట్‌ ఎలా ఇచ్చారు? మహారాష్ట్ర స్థానికుడికి ఇవ్వాలి కదా? ఏం తినాలో మాకు తెలుసు’’ అంటూ విమర్శించారు. దక్షిణాదివారు డ్యాన్స్‌ బార్లు, లేడీస్‌ బార్లను నడుపుతూ.. పిల్లల్ని చెడగొడుతుంటారని, అలాంటి వారు మంచి ఆహారం ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే తీవ్రంగా ఖండించారు.

Updated Date - Jul 11 , 2025 | 05:13 AM