Share News

Maharashtra Minister Resigns: మహారాష్ట్రలో సర్పంచ్ హత్య కేసు కలకలం.. మంత్రి రాజీనామా

ABN , Publish Date - Mar 04 , 2025 | 11:48 AM

ఓ సర్పంచ్ హత్య కేసులో తన సన్నిహిఓ సర్పంచ్ హత్య కేసులో తన సన్నిహితుడు అరెస్టైన నేపథ్యంలో మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే తన పదవికి తాజాగా రాజీనామా చేశారు. తుడు అరెస్టైన నేపథ్యంలో మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే తన పదవికి తాజాగా రాజీనామా చేశారు.

Maharashtra Minister Resigns: మహారాష్ట్రలో సర్పంచ్ హత్య కేసు కలకలం.. మంత్రి రాజీనామా

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భీడ్ జిల్లాలో సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసులో ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ధనుంజయ్ ముండే సన్నిహితుడు అరెస్టు కావడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ధనుంజయ్ ముండే తన పదవికి తాజాగా రాజీనామా చేశారు. ఈ కేసులో మంత్రి సన్నిహితుడు వాల్మీక్ కడార్ అరెస్టు కావడంతో సీఎం దేవేంద్ర ఫడణవీస్ సూచన మేరకు ధనుంజయ్ రాజీనామా చేశారు. మంత్రి రాజీనామాను ఆమోదించినట్టు ముఖ్యమంత్రి మీడియాకు తెలిపారు. గవర్నర్ ఆమోదం కోసం పంపించినట్టు వెల్లడించారు (Maharashtra Minister Dhananjay Munde Resigns).


Indian Man Killed: కేరళ వ్యక్తిని కాల్చి చంపిన జోర్డాన్‌ సైన్యం

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ముండే రాజీనామాకు మునుపు సీఎం ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో ఈ విషయమై సమావేశమయ్యారు. ధనుంజయ్ ముండే అజిత్ పవార్ వర్గానికి చెందిన వారు కావడంతో ఈ పరిణామం తాలూకు రాజకీయ ప్రభావాలపై చర్చించారట. సర్పంచ్ హత్య కేసు విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలు, చార్జ్ షీట్‌, రాజకీయ పరిణామాలు తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయట.


Shahzadi Khan: యూపీ మహిళకు యూఏఈలో ఉరి

ధనంజయ ముండే భీడ్ జిల్లాలోని పార్లీ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే, మహారాష్ట్ర మంత్రి పంకజ ముండేకు బంధువు. 2013లో ఆయన ఎన్సీపీలో చేరారు. 2023లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలిపోయినప్పుడు ధనుంజయ్ అజిత్ పవార్ వెంట నడిచారు. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా సేవలందించారు.

Read Latest and National News

Updated Date - Mar 04 , 2025 | 11:48 AM