Share News

Devendra Fadnavis: సీఎం సంచలన వ్యాఖ్యలు..ఇడియట్స్ మాటలకు స్పందించనని వెల్లడి

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:20 PM

26/11 ముంబై ఉగ్రవాద దాడులపై కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించినందుకు తీవ్ర స్థాయిలో స్పందించారు.

Devendra Fadnavis: సీఎం సంచలన వ్యాఖ్యలు..ఇడియట్స్ మాటలకు స్పందించనని వెల్లడి
Maharashtra CM Devendra Fadnavis

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. 26/11 ముంబై దాడికి సంబంధించి దిగ్విజయ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఇలా అన్నారు. "మొదట, మూర్ఖులలా మాట్లాడే వ్యక్తులకు నేను స్పందించను. కసబ్‌ను ఉరితీసినప్పుడు, ఆ తర్వాత, డేవిడ్ హెడ్లీ వాంగ్మూలం మన న్యాయవ్యవస్థలో నమోదైందన్నారు. ఈ కుట్ర మొత్తం పాకిస్తాన్‌లోనే జరిగిందని పూర్తిగా స్పష్టమైందని చెప్పారు. కానీ ఈ కుట్ర సిద్ధాంతాలలో RSS ప్రమేయం ఉందని ప్రచారం చేసే వారికి, స్పందించాలనుకోవడం లేదన్నారు సీఎం ఫడ్నవీస్. ఇప్పుడు ప్రధాన కుట్రదారుడు మన అదుపులో ఉన్నాడు కాబట్టి, మరిన్ని విషయాలు బయటకు వస్తాయని సీఎం చెప్పారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ కారణమని..

2010లో, మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసును నిర్వహించిన తీరు కారణంగా మితవాద గ్రూపుల నుంచి తనకు ముప్పు ఉందని ముంబై ఉగ్రవాద దాడికి ముందు మాజీ ATS చీఫ్ హేమంత్ కర్కరే తనకు ఫోన్ చేసి చెప్పారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. కర్కరేను ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు లక్ష్యంగా చేసుకున్నారని, ఆయన మరణానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కారణమని సింగ్ వ్యాఖ్యానించారు. 2008లో ముంబైలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడుల తర్వాత మాజీ ATS చీఫ్ హేమంత్ కర్కరే మరణించారు.


అధికారుల దర్యాప్తు..

ఈ క్రమంలో ఇటీవల అమెరికా నుంచి రప్పించబడిన 26/11 ముంబై దాడి నిందితుడు తహవ్వూర్ రాణాను 18 రోజుల రిమాండ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారిస్తోంది. భారతదేశంలోని అనేక నగరాల్లో ఇలాంటి ఉగ్రవాద కుట్రలకు ప్లాన్ వేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కుట్ర మొత్తాన్ని ఒకచోట చేర్చడానికి, అధికారులు రానాను వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లి, 17 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల వివరాలను ఆరా తీయనున్నారు. అమెరికా భారతదేశానికి అప్పగించిన తర్వాత రాణా ఢిల్లీ చేరుకున్నాడు. అర్థరాత్రి, NIA కోర్టు అతనికి 18 రోజుల రిమాండ్‌ విధించింది.


దాడి జరిగిన ప్రదేశం

నవంబర్ 26, 2008న, 10 మంది లష్కరే తాలిబా ఉగ్రవాదులు ముంబై దక్షిణ ప్రాంతంలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, రెండు ఆసుపత్రులు, ఒక థియేటర్‌తో సహా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. ఆ క్రమంలో ఉగ్రవాదులు నారిమన్ హౌస్, లగ్జరీ హోటళ్ళు ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహల్ ప్యాలెస్ & టవర్ వంటి మూడు ప్రదేశాలలో ప్రజలను బందీలుగా ఉంచారు. ముంబైలో నవంబర్ 28న రెండు రోజుల పాటు జరిగిన ఈ దాడుల్లో భారత భద్రతా దళాలు తొమ్మిది మంది ఉగ్రవాదులను హతమార్చాయి. ఆ క్రమంలో అజ్మల్ కసబ్ అనే వ్యక్తిని సజీవంగా అరెస్టు చేయడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


ఇవి కూడా చదవండి:

కోతి కోసం వీళ్ల సాహసానికి సెల్యూట్

Plane Crash: న్యూయార్క్ తర్వాత మరో విమాన ప్రమాదం..ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు


SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా


Stock Market Rally: లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 1,140 పాయింట్లు జంప్

EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 12 , 2025 | 12:22 PM