Maharashtra Fire News: మనిసూరత్ కాంప్లెక్స్‌లో ఎగిసిపడుతున్న మంటలు
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:23 AM
Maharashtra Fire News: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మనిసూరత్ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

మహారాష్ట్ర, ఏప్రిల్ 26: మహారాష్ట్రలోని బీవండిలో భారీ అగ్నిప్రమాదం (Maharashtra Fire Accident) సంభవించింది. ఈరోజు (శనివారం) ఉదయం మనిసూరత్ కాంప్లెక్స్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మనిసూరత్ కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్థులో మొదలైన మంటలు క్రమంగా పై ప్రాంతానికి వ్యాపించాయి. దీంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. రెండు అగ్నిమాపక వాహనాలు అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అగ్నిమాపక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో చుట్టుపక్కల వాసులు భయాందోళనకు గురయ్యారు.
అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అలాగే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాల్లో భారీగా ప్రజలు గుమిగూడగా వారిని పోలీసులు అక్కడి నుంచి తరలించేశారు. మనిసూరత్ కాంప్లెక్స్ పక్కన నివాసితులు దూరంగా ఉండగాలని.. రెస్క్యూ టీంకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా.. ముంబైలోని అంధేరి లోఖండ్‌వాలలో గల ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. బ్రోక్ ట్యాండ్ భవనంలో ఈరోజు తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు ఆస్పత్రిపాలయ్యారు. ఎనిమిది అంతస్తులు ఉన్న ఈ భవనంలోని మొదటి అంతస్తులోని ఓ ఇంట్లో మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఫర్నీచర్, బట్టలు, గ్రహోపకరణాలు అన్నీ కూడా మంటలకు ఆహుతయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు పొగపీల్చడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.వారిలో ఓ మహిళ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది.
ఇవి కూడా చదవండి
Karreguttalu Encounter: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 38 మంది మావోలు మృతి
Letter to CM: మావోయిస్టులతో చర్చలకు ముగ్గురు పేర్లు ప్రతిపాదన
Read Latest National News And Telugu News