CM Convoy Break Down: సీఎం కాన్వాయ్‌లోని 19 కార్లు ఒకేసారి బ్రేక్‌డౌన్.. ఎందుకంటే
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:56 PM
ముఖ్యమంత్రి షెడ్యూల్ ప్రకారం రత్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి శుక్రవారంనాడు బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక 19 ఎస్‌యూవీలతో కూడిన కాన్వాయ్‌లో సమస్యలు తలెత్తాయి. వాహనాలు జర్క్‌లు ఇస్తూ నిలిచిపోయాయి.

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav) ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కు మార్గమధ్యంలో అనూహ్యమైన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కాన్వాయ్‌లోని 19 వాహనాలు ఒకదాని వెంట మరొకటి రోడ్డుపైనే నిలిచిపోయాయి.
ముఖ్యమంత్రి షెడ్యూల్ ప్రకారం రత్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి శుక్రవారంనాడు బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక 19 ఎస్‌యూవీలతో కూడిన కాన్వాయ్‌లో సమస్యలు తలెత్తాయి. వాహనాలు జర్క్‌లు ఇస్తూ నిలిచిపోయాయి. వాహనాలను నెట్టే ప్రయత్నం చేసినప్పటికీ అవి స్టార్ట్ కాలేదు. దీంతో మరో ప్రత్యేక వాహనంలో సీఎం ముందుకు సాగారు. సీఎం కాన్వాయ్‌లోని వాహనాలు రోడ్డుపైనే మొరాయించడానికి స్థానిక పెట్రోల్ పంప్‌లో డీజిల్ కల్తీ కావడమే కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు.
తొలుత ఒకటి, రెండు కార్లలో సమస్య తలెత్తినా ఆ తర్వాత అన్ని వాహనాలు నిలిచిపోయినట్టు కాన్వాయ్ డ్రైవరు శుభం వర్మ తెలిపారు. స్థానిక పెట్రోల్ పంప్‌లో 350 లీటర్ల డీజిల్ నింపామని, అయితే కల్తీకి అవకాశమే లేదని సిబ్బంది చెబుతున్నారని పేర్కొన్నారు. కాగా, స్థానిక యువకుడు ఒకరు ఇదే పెట్రోల్ పంప్ నుంచి నింపుకున్న డీజిల్‌లో వాటర్ లేయర్లు కనిపించడంతో డీజిల్ శాంపుల్స్ సేకరించిన ఫుడ్ అండ్ సివిల్ సప్లై అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టారు. ఆ శాంపుల్స్‌లో నీళ్లు కలిసినట్టు గుర్తించారు. దీనిపై మరింత విచారణ జరిపి సమగ్ర నివేదకను రత్లాం కలెక్టర్‌కు అందజేస్తామని ఫుడ్ డిపార్ట్‌మెంట్ అధికారి ఆనంద్ గోలే తెలిపారు. ప్రస్తుతం పెట్రోల్ పంప్‌ను అధికారులు సీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
చైనాతో ఫలించిన చర్చలు.. ఆరేళ్ల తర్వాత కైలాష్ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం..
రథయాత్రలో అపశ్రుతి.. బీభత్సం సృష్టించిన ఏనుగు..
For More National News