Leopard: చిరుత సంచరిస్తోంది.. ఆ గుట్టవైపు వెళ్లొద్దు
ABN , Publish Date - Jul 25 , 2025 | 01:42 PM
కర్ణాటక రాష్ట్రం, రాయచూరు జిల్లాలోని సింధనూరు తాలూకా రౌడకుందా గ్రామ సమీపంలో గల గుట్ట పై చిరుత సంచారాన్ని గ్రామస్థులు గుర్తించారు. కొన్నాళ్ల క్రితం గ్రామానికి చెందిన పశువులు అకస్మాత్తుగా చనిపోగా కొన్నింటి పై చిరుత దాడి జరిగినట్లు రైతులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

- రౌడకుందా గుట్టపై చిరుత సంచారం
రాయచూరు(బెంగళూరు): కర్ణాటక రాష్ట్రం, రాయచూరు జిల్లాలోని సింధనూరు(Sindhanur) తాలూకా రౌడకుందా గ్రామ సమీపంలో గల గుట్ట పై చిరుత(Leopard) సంచారాన్ని గ్రామస్థులు గుర్తించారు. కొన్నాళ్ల క్రితం గ్రామానికి చెందిన పశువులు అకస్మాత్తుగా చనిపోగా కొన్నింటి పై చిరుత దాడి జరిగినట్లు రైతులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
గుట్ట సమీపంలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు చిరుత సంచరిస్తున్నట్లు జాడల ద్వారా గుర్తించి గుట్టకు ఇరువైపుల రెండు బోన్లను అమర్చారు. ఇది జరిగి నాల్గు రోజులు కావస్తున్నా ఇప్పటికి చిరుత బోనుకు చిక్కక పోవడం గమనార్హం. కాగా బుధవారం రాత్రి వేళ చిరుత గుట్టపై సంచరిస్తున్నట్లు చూసిన గ్రామస్థులు బెంబేలెత్తిపోతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అప్పులు తీర్చలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య
Read Latest Telangana News and National News