Share News

Leopard: అర్ధరాత్రి పోలీసుస్టేషన్‌లోకి చొరబడిన చిరుత..

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:48 PM

దానికేం తెలుసు.. అది పోలీసుస్టేషన్‌ అని. ఓ చిరుతపులి దర్జాగా స్టేషన్‏లోకి చొరబడింది. నీలగిరి జిల్లా ఊటీ సమీపం నడువట్టమ్‌ ప్రాంతంలో అడవి నుండి వచ్చిన చిరుతపులి అక్కడి పోలీసుస్టేషన్‌లోకి చొరబడింది. ఆ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

Leopard: అర్ధరాత్రి పోలీసుస్టేషన్‌లోకి చొరబడిన చిరుత..

చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లా ఊటీ సమీపం నడువట్టమ్‌ ప్రాంతంలో అడవి నుండి వచ్చిన చిరుతపులి అక్కడి పోలీసుస్టేషన్‌లోకి చొరబడింది. ఆ చిరుత పోలీసుస్టేషన్‌ గదులన్నీ కలియతిరిగి వెళ్తుండగా అప్పుడే నగర గస్తీకి వెళ్ళి తిరిగొచ్చిన ఓ కానిస్టేబుల్‌ చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. కాసేపయ్యాక స్టేషన్‌ తలుపులను మూసి అక్కడి నుండి వెళ్ళిపోయారు.

ఈ వార్తను కూడా చదవండి: High Court: 1 నుంచి హైకోర్టుకు సెలవులు


nani3.2.jpg

ఆ కానిస్టేబుల్‌ తెలిపిన సమాచారం మేరకు పోలీసులు స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాలో నమోదైన వీడియో దృశ్యాలను పరిశీలించగా, స్టేషన్‌లో చిరుతపులి చొరబడి గదుల్లో ఆహారం కోసం వెదుకుతూ అక్కడి నుండి వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ వీడియో చూసినప్పటి నుంచి పోలీసులు ఆ స్టేషన్‌లో రాత్రిపూట పనిచేయడానికి జంకుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Cyber Fraud: నయా సైబర్‌ మోసం.. ఆర్మీ పేరుతో విరాళాలకు విజ్ఞప్తి

మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారంపై కట్టడి

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!

మహిళపై చేయిచేసుకున్న పోలీస్

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2025 | 12:48 PM