Share News

Leopard: ఊరంతా ఏకమై.. చిరుతను బంధించారు..

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:49 PM

గ్రామస్థులంతా కలిసి చిరుతను బంధించారు. మంగళవారం బాగేపల్లి తాలూకా పరిధిలోని వర్లకొండ గ్రామం వరాహగిరి కొండపై కరేనహళ్ళికి చెందిన రైతుపై చిరుత దాడి చేసింది.

Leopard: ఊరంతా ఏకమై.. చిరుతను బంధించారు..

- రైతుపై చిరుత దాడి

- కలిసికట్టుగా బంధించిన గ్రామస్థులు

బాగేపల్లి(బెంగళూరు): గ్రామస్థులంతా కలిసి చిరుతను బంధించారు. మంగళవారం బాగేపల్లి(Bgepalli) తాలూకా పరిధిలోని వర్లకొండ గ్రామం వరాహగిరి కొండపై కరేనహళ్ళికి చెందిన రైతుపై చిరుత దాడి చేసింది. అయితే గాయాలతో ఆయన బయట పడ్డారు. ఇటీవల కొన్నిరోజులుగా వరాహగిరి కొండపై చిరుతసంచారం, బండపై విశ్రాంతి తీసుకున్న దృశ్యాలు డ్రోన్‌కెమెరాకు చిక్కాయి. వర్లకొండ (Varlakonda) పక్కన ఉన్న కరేనహళ్ళికి చెందిన రైతు రామకృష్ణప్ప గొర్రెలు మేపేందుకు వెళ్లగా చిరుత దాడి చేసింది.


pandu1.2.jpg

వీపుపై గాయాలు కావడంతో రైతు కేకలు వేశారు. చుట్టుపక్కలవారు రావడంతో చిరుత అక్కడనుంచి పరుగులు తీసింది. అయితే విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్థులు దండుకర్రలతో అక్కడికి చేరుకున్నారు. ఆర్‌ఎఫ్ఓ రాజశేఖర్‌, అటవీశాఖ సిబ్బంది సహకారంతో కొండల్లోనున్న చిరు తను బంధించేశారు.


pandu1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

విద్యార్థుల హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించాలి

అధికారులు ఉత్సాహంగా పనిచేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 02 , 2025 | 12:49 PM