Chennai: కొడనాడు హత్య, దోపిడీ కేసు.. సీబీసీఐడీ విచారణకు సయాన్ హాజరు
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:48 PM
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన హత్య, దోపిడీ కేసు విచారణకు సయాన్ హాజరయ్యారు. నీలగిరి జిల్లాలో జయలలితకు చెందిన అత్యంత ఖరీదైన ‘కొడనాడు ఎస్టేట్’ ఉంది. దీంట్లోనే జయలలితకు చెందిన బంగారం నగలు, భూముల పత్రాలు, ఇతరత్రా ఆసంతులకు సంబంధించిన పత్రాలు ఉండేవని సమాచారం.

చెన్నై: కొడనాడు(Kodanadu) హత్య, దోపిడీ కేసులో సీబీసీఐడీ విచారణకు సయాన్ హాజరయ్యాడు. నీలగిరి(Neelagiri) జిల్లా కోతగిరి సమీపం కొడనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో 2017లో వాచ్‌మెన్ హత్య, ఎస్టేట్ భవనంలో దోపిడీ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సయాన్, వాళయార్ మనోజ్ సహా 10 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారు బెయిలుపై విడుదలయ్యారు.
ఈ వార్తను కూడా చదవండి: Pahalgam Terror Attack: దేశం వీడుతోన్న పాకిస్థానీయులు..
ఈ కేసు విచారణ చేపట్టిన సీబీసీఐటీ ఇప్పటివరకు 300 మందిని విచారించింది. ఈ కేసులో ముఖ్యమైన నిందితుడుగా భావిస్తున్న సయాన్‌ను ఇప్పటికే ఒకసారి సీబీసీఐడీ పోలీసులు విచారించారు. ఈ కేసులో అతనిని మళ్లీ విచారించాలని నిర్ణయించి సీబీసీఐడీ పోలీసులు సమన్లు జారీచేశారు. ఆ ప్రకారం, గురువారం కోవై గాంధీపురంలోని సీబీసీ ఐడీ కార్యాలయంలో జరిగిన విచారణకు సయాన్ హాజరయ్యాడు.
ఈ వార్తలు కూడా చదవండి
దేశ భద్రతపై కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు
పంచాయతీలకు ఎన్నికల్లేవు.. అభివృద్ధికి నిధుల్లేవు!
కౌశిక్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట
పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చారు
Read Latest Telangana News and National News