Parliament Session: ఆపరేషన్ సిందూర్‌పై రాజ్యసభలో చర్చను ప్రారంభించనున్న ఖర్గే
ABN , Publish Date - Jul 28 , 2025 | 06:05 PM
ఆపరేషన్ సిందూర్‌పై రాజ్యసభలో చర్చించేందుకు కాంగ్రెస్‌కు సుమారు రెండు గంటల సమయం కేటాయించారు. ఈ చర్చలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొంటారని తెలుస్తోంది.

న్యూఢిల్లీ: 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)పై రాజ్యసభ (Rajya Sabha)లో ప్రత్యేక చర్చను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మంగళవారంనాడు ప్రారంభించనున్నారు. దీనిపై 16 గంటల సేపు చర్చ జరుగనుండగా, కాంగ్రెస్‌కు సుమారు రెండు గంటల సమయం కేటాయించారు. రాజ్యసభలో జరిగే చర్చలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొంటారని తెలుస్తోంది.
లోక్‌సభలో కొనసాగుతున్న చర్చ
కాగా, ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై లోక్‌సభలో 16 గంటల చర్చ సోమవారంనాడు మొదలైంది. ఈ చర్చను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. భారత సైన్యం సత్తాకు ఆపరేషన్ సిందూర్ నిదర్శనమని, ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని చెప్పారు. ఆత్మరక్షణ కోసమే సైనిక చర్య తీసుకున్నామని, రెచ్చగొట్టడానికో, విస్తరణవాదం కోసమో కాదని చెప్పారు. భారత్ సత్తాతో పాకిస్థాన్ ఓటమిని అంగీకరించి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసిందన్నారు. దీంతో ఆపరేషన్ సిందూర్‌కు విరామం ఇచ్చామని, భవిష్యత్తులో పాక్ మళ్లీ దుస్సాహసానికి పాల్పడితే ఆపరేషన్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. కాల్పుల విరమణకు ఎవరి ఒత్తిడీ లేదని కూడా ఆయన వివరణ ఇచ్చారు.
వీటికి సమాధానం ఏదీ..
చర్చలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పాల్గొంటూ, అసలు పాక్ ఉగ్రవాదులు ఇండియాలో ఎలా అడుగుపెట్టారు, పహల్గాం ఎలా చేరుకున్నారో రాజ్‌నాథ్ తన ప్రకటనలో చెప్పలేదన్నారు. పహల్గాం ఉగ్రదాడి భద్రతా లోపాలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాదే బాధ్యతని అన్నారు. పాక్-భారత్ మధ్య కాల్పుల విరమణ తమ వల్లే జరిగిందంటూ ట్రంప్ 26 సార్లు ప్రకటించుకోవడం వెనుక నిజమేమిటో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని, దీనిపై రక్షణ మంత్రి కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో మాట్లాడాలని విపక్షాలు కోరుకుంటున్నాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం.. ప్రధాన సూత్రధారి ఖేల్ ఖతం
ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో చర్చ.. శశి థరూర్ ఎందుకు దూరం?
For More National News and Telugu News..