Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన ఖర్గే, రాహుల్
ABN , Publish Date - Apr 22 , 2025 | 08:15 PM
ఉగ్రవాదంపై పోరుకు యావద్దేశం కలిసికట్టుగా పోరాడాలని మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి(Terror Attack)ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), సీనియర్ నేత రాహుల్ గాంధీ ఖండించారు. ఉగ్రవాదంపై పోరుకు యావద్దేశం కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
PM Modi: ఉగ్రవాదుల దష్టపన్నాగం ఎన్నటికీ నెరవేరదు.. పహల్గాం ఉగ్రదాడిపై మోదీ
''ఉగ్రదాడి పరికిపందల చర్య. ఈ దాడిలో పలువురు పర్యాటకులు మృతిచెందడం, మరికొందరు గాయపడటం కలిచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు్న్నాను. క్షతగాత్రులు త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నారు. జమ్మూకశ్మీర్‌లో మామాలు పరిస్థితి నెలకొందంటూ ఉత్తుత్తి మాటలు చెప్పడానికి బదులు ప్రభుత్వం జవాబుదారీతనం తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి'' అని రాహుల్ గాంధీ అన్నారు.
లక్షిత దాడులు మానవత్వానికే మచ్చ
లక్షితదాడులు మానవత్వానికే మచ్చ అని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇలాంటి పరికిపంద చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. సరిహద్దు ఉగ్రవాదంపై పోరాటానికి యావద్దేశం ఐక్యంగా నిలబడాలని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోందని అన్నారు.
ఇవి కూాడా చదవండి..