Share News

PM Modi: కెనడాలో మోదీపై దాడికి ఖలిస్థానీల కుట్ర

ABN , Publish Date - Jun 18 , 2025 | 03:24 AM

ప్రధాని మోదీ కెనడా పర్యటన సందర్భంగా ఖలిస్థానీ వేర్పాటువాదులు ఆకస్మిక దాడికి కుట్రపన్నారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు మోదీ మంగళవారం కెనడాకు చేరుకున్నారు.

PM Modi: కెనడాలో మోదీపై దాడికి ఖలిస్థానీల కుట్ర

టొరంటో, జూన్‌ 17: ప్రధాని మోదీ కెనడా పర్యటన సందర్భంగా ఖలిస్థానీ వేర్పాటువాదులు ఆకస్మిక దాడికి కుట్రపన్నారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు మోదీ మంగళవారం కెనడాకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అల్బెర్టా రాష్ట్రంలోని కల్గరీ నగరంలో నిరసన తెలిపేందుకు ఖలిస్థానీ వేర్పాటువాదులు గుమిగూడారు. ఈ కార్యక్రమాన్ని మోదీకి వ్యతిరేకంగా ‘ఆకస్మిక దాడి’గా వేర్పాటువాదులు అభివర్ణించుకున్నారు. ఈ సందర్భంగా హింసాత్మక నినాదాలు చేశారు. ‘మోదీ రాజకీయాలను చంపేయండి(కిల్‌ మోదీ పాలిటిక్స్‌)’ అంటూ కెనడా ప్రధాని మార్క్‌ కార్నీకి నిరసనకారులు పిలుపునిచ్చారు.


అలాగే, ‘భారత రాజకీయాలను చంపేయండి(కిల్‌ ఇండియా పాలిటిక్స్‌)’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు నిరసనకారులు పిలుపునిచ్చారు. కొందరు నిరసనకారులు దూకుడుగా దూసుకొచ్చి త్రివర్ణ పతాకాన్ని కిందపడేసి తొక్కారని, చించివేశారని కెనడా జర్నలిస్టు డానియెల్‌ బార్డ్‌మన్‌ తెలిపారు. సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఖలిస్థానీ వేర్పాటువాదుల తీరును సిక్కు సంస్థలు ఖండించార

Updated Date - Jun 18 , 2025 | 03:25 AM