PM Modi: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం
ABN , Publish Date - Jul 24 , 2025 | 05:09 PM
భారత్-బ్రిటన్ సంబంధాల్లో ఇవాళ చరిత్రాత్మక రోజు అని ప్రకటించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. చాలా ఏళ్ల కృషి తర్వాత భారత్-బ్రిటన్ మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగడం సంతోషకరమన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: భారత్-బ్రిటన్ సంబంధాల్లో ఇవాళ(గురువారం) చరిత్రాత్మక రోజు అని ప్రకటించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. చాలా ఏళ్ల కృషి తర్వాత భారత్-బ్రిటన్ మధ్య సమగ్ర స్వేచ్చా ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగడం సంతోషకరమన్నారు. AI, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో ఇరుదేశాలు కలిసి ముందుకు సాగుతామని మోదీ చెప్పారు. బ్రిటన్, భారత్ భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని కూడా మోదీ తెలిపారు.
భారత్‌లో త్వరలో ఆరు బ్రిటన్ వర్సిటీలు తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇరుదేశాల సేవల రంగం.. ఆర్థిక, సాంకేతిక రంగాలకు ఊతమిస్తుందని మోదీ అన్నారు. ఈ ఒప్పందం ద్వారా సులభతర వాణిజ్య విధానానికి మరింత ఊతం వచ్చిందని వ్యాఖ్యానించారు. 'ఇరుదేశాల మధ్య ఉపాధి కల్పన అవకాశాలు విస్తృతం అవుతాయి. భారత్-బ్రిటన్ భాగస్వామ్యంలో విజన్-2035 లక్ష్యంగా సాగుతున్నాం' అని మోదీ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్స్టాప్లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News