Share News

BS Yediyurappa: పోక్సో కేసులో మాజీ సీఎంకు స్వల్ప ఊరట

ABN , Publish Date - Mar 14 , 2025 | 06:02 PM

పదిహేడేళ్ల బాలికపై యడియూరప్ప గతంలో లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 2న ఒక కేసులో సాయం కోరుతూ బాలిక తన తల్లితో కలిసి యడియూరప్పను ఆయన నివాసంలో కలిసింది.

BS Yediyurappa: పోక్సో కేసులో మాజీ సీఎంకు స్వల్ప ఊరట
Ex-CM-Yediyurappa.jpg

బెంగళూరు: బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సెంట్రల్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు బీఎస్ యడియూరప్ప (BS Yadiyurappa)కు స్వల్ప ఊరట లభించింది. మార్చి 15న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలంటూ ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన సమన్లపై కర్ణాటక హైకోర్టు (Karnataka Court) శుక్రవారంనాడు స్టే ఇచ్చింది.

Tamilnadu: రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్.. స్టాలిన్ సర్కార్‌పై బీజేపీ సంచలన ఆరోపణ


Karnataka Ex CM

పదిహేడేళ్ల బాలికపై యడియూరప్ప గతంలో లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 2న ఒక కేసులో సాయం కోరుతూ బాలిక తన తల్లితో కలిసి యడియూరప్పను ఆయన నివాసంలో కలిసింది. ఆ సమయంలోనే తన కూతురుపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీనిపై సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి విచారణకు కేసును సీఐడీకి అప్పగించారు. సీఐడీ తిరిగి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, చార్జిషీటును కూడా నమోదు చేసింది. కాగా, లైంగిక దాడి ఆరోపణలను యడియూరప్ప కార్యాలయం ఖండించింది


ఈ కేసులో యడియూరప్పను ముందస్తుగా అరెస్టు చేయకుండా గతంలో హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపు ఇచ్చింది.


ఇవి కూడా చదవండి..

Jaffar Express Attack: ఉగ్రవాదానికి కేంద్ర స్థానం ఎవరో ప్రపంచానికి తెలుసు... పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

Bengaluru: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. విషయం ఏంటంటే..

Divya: నటుడు సత్యరాజ్‌ కుమార్తె దివ్య ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2025 | 06:14 PM