Share News

Actor stabbed: నటిపై కత్తితో భర్త దాడి

ABN , Publish Date - Jul 12 , 2025 | 09:49 PM

మూడు నెలల క్రితం భర్త నుంచి వేరుపడి తన సోదరుడి ఇంటికి వెళ్లిపోయింది. హౌస్ లీజ్ విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవలు ఉండటంతో హనుమాన్ నగర్ స్టేషన్‌లో ఆమె పోలీసు కంప్లెయింట్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో గత గురువారం వీరిద్దరూ రాజీపడ్డారు.

Actor stabbed: నటిపై కత్తితో భర్త దాడి
Manjula Sruthi

బెంగళూరు: షాకింగ్ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కన్నడ టీవీ నటి, యాంకర్ మంజులా శ్రుతి (Manjula Shruthi)పై ఆమె భర్త కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. జూలై 4న హనుమాన్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునేశ్వర లేఔట్‌లో ఈ ఘటన జరుగగా, ఇప్పుడు వెలుగుచూసింది.


సంఘటన పూర్వాపరాల ప్రకారం, 20 ఏళ్ల క్రితం శ్రుతి, అమ్రేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హనుమంత్ నగర్‌లో అద్దె ఇంట్లో ఉండేవారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే శ్రుతి పవర్తనపై అనుమానం కలగడంతో వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. మూడు నెలల క్రితం భర్త నుంచి వేరుపడి తన సోదరుడి ఇంటికి వెళ్లిపోయింది. హౌస్ లీజ్ విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవలు ఉండటంతో హనుమాన్ నగర్ స్టేషన్‌లో శ్రుతి పోలీసు కంప్లెయింట్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో గత గురువారం వీరిద్దరూ రాజీపడ్డారు. ఊహించని విధంగా ఆ మరుసటి రోజే పిల్లలు కాలేజీకి వెళ్లిన సమయంలో అమ్రేష్ శ్రుతిపై దాడి చేశాడు. మొదట పెప్పర్ స్ప్రే చల్లి ఆ తర్వాత కత్తితో పక్కటెముకలు, మెకాలి పైభాగం, మెడపై పలుమార్లు దాడి చేశాడు. తలను గోడకేసి కొట్టాడు.


తీవ్రంగా గాయపడిన శ్రుతి ప్రస్తుతం విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హనుమంత నగర్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అమ్రేష్‌ను అరెస్టు చేసారు. శ్రుతి, అమ్రేష్ మధ్య గృహ హింసకు సంబంధించి హనుమంతనగర్ పోలీసు స్టేషన్‌లో రెండు కేసులు నమోదైనట్టు పోలీసులు ధ్రువీకరించారు.


ఇవి కూడా చదవండి..

ఇంట్లో ఆంక్షలు, స్వేచ్ఛ కావాలనుకున్న రాధిక.. హత్య కేసులో కీలక సమాచారం

కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 12 , 2025 | 09:56 PM