Kangana Ranaut: రాజకీయాలను ఆస్వాదించలేకపోతున్నా: కంగన
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:44 AM
తాను రాజకీయాలను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నానని, పాలిటిక్స్‌ను ఆస్వాదించలేకపోతున్నానని ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు.

న్యూఢిల్లీ, జూలై 9: తాను రాజకీయాలను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నానని, పాలిటిక్స్‌ను ఆస్వాదించలేకపోతున్నానని ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. రాజకీయ రంగం విభిన్న పనితనంతో కూడుకున్నదని.. ఎక్కువగా సామాజిక సేవను తలపిస్తోందని చెప్పారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో కంగన ఈ వ్యాఖ్యలు చేశారు. మోరీలు బాగుచేయించాలంటూ తన వద్దకు ప్రజలు వస్తున్నారని.. అయితే తానో ఎంపీని అనే విషయాన్ని మరిచిపోయి, పంచాయతీ స్థాయి సమస్యలను పట్టుకొని తన వద్దకు రావడం ఏమిటి? అని అమె ప్రశ్నించారు.
ఇంకొందరేమో గుంతలు పడ్డ రోడ్లను బాగు చేయించాలంటూ ఎమ్మెల్యేల స్థాయిలో సమస్యలు చెప్పుకొంటారని, అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సమస్యలని తాను చెప్పినా పట్టించుకోరని.. పైగా ‘‘మీ దగ్గర డబ్బుంది చేయవచ్చు కదా’’ అని అడుగుతున్నారని వాపోయారు.