Share News

Kamal Haasan: రాజ్యసభకు కమల్‌ హాసన్‌ నామినేషన్‌

ABN , Publish Date - Jun 07 , 2025 | 06:02 AM

ప్రముఖ సినీ నటుడు, ‘మక్కల్‌ నీది మయ్యం’ అధినేత కమల్‌ హాసన్‌ రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేశారు.

Kamal Haasan: రాజ్యసభకు కమల్‌ హాసన్‌ నామినేషన్‌

చెన్నై, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ నటుడు, ‘మక్కల్‌ నీది మయ్యం’ అధినేత కమల్‌ హాసన్‌ రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి వెంట రాగా, కమల్‌ నామినేషన్‌ పత్రాలను శుక్రవారం చెన్నైలో ఎన్నికల అధికారికి అందించారు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో తమ కూటమికి మద్దతు ప్రకటించిన కమల్‌కు రాజ్యసభ స్థానం ఇస్తామని ప్రకటించిన స్టాలిన్‌.. ఆ మేరకు అవకాశం కల్పించారు.


త్వరలో తమిళనాడు నుంచి ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండగా, అసెంబ్లీలో బలాబలాలను బట్టి డీఎంకేకు 4, అన్నాడీఎంకే 2 స్థానాలు ఖాయమైంది. దీంతో డీఎంకే నుంచి కమల్‌తో పాటు సిట్టింగ్‌ రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది పి.విల్సన్‌, కవయిత్రి సల్మా, సీనియర్‌ నేత ఎస్‌ఆర్‌ శివలింగం, అన్నాడీఎంకే తరఫు నుంచి న్యాయవాది ఇన్బదురై, మాజీ ఎమ్మెల్యే ధనపాల్‌ నామినేషన్లు దాఖలు చేశారు. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికవడం దాదాపు ఖాయమైనట్టే.

Updated Date - Jun 07 , 2025 | 06:02 AM