Chennai: పాక్ జలసంధి వద్ద తీరానికి కొట్టుకొస్తున్న జెల్లీ చేపలు.. వాటిని తాకితే..
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:57 PM
ఆ చేపలను తినడం ఏమోగాని తాకితేనే వివిధ చర్మ వ్యాధులు వస్తున్నాయట. రామేశ్వరం సమీపం పాక్ జలసంధి ప్రాంతం వద్ద జెల్లీ చేపలు తీరానికి కొట్టుకురావటంతో జాలర్లు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ చేపలను తినడం సంగతి అటుంచితే కనీసం తాకితేనే వివిధ చర్మవ్యాధులు వస్తున్నాయని పలువురు తెలుపుతున్నారు.

చెన్నై: రామేశ్వరం(Rameshwaram) సమీపం పాక్ జలసంధి ప్రాంతం వద్ద గత రెండు రోజులుగా జెల్లీ చేపలు తీరానికి కొట్టుకురావటంతో జాలర్లు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ జెల్లీ చేపలను తాకితేనే చర్మవ్యాధులు వస్తాయని, దురదలు అధికమవుతాయని జాలర్లు చెబుతున్నారు. సోరంకోట్టై నుండి కోదండరామాలయం(Kodanda Ramalayam) ఎదురుగా ఉన్న తీరం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర ఈ జెల్లీ చేపలు వేల సంఖ్యలో పడి ఉన్నాయని జాలర్లు చెబుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Stalin: రాష్ట్రంలో మత ఉగ్రవాదాన్ని సహించబోం..
ఇప్పటికే ఈ జెల్లీ చేపల వల్ల సుమారు యాభై మందికిపైగా జాలర్లు దురదలతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ జెల్లీ చేపలపై మత్స్యపరిశోధకులు పరీక్షలు జరపాలని జాలర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్-విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణకు 5 వేల కోట్లు
డిజిటల్ లైంగిక నేరాలపై చట్టమేదీ?
చిన్నారి ప్రాణం తీసిన పల్లీ గింజ
Read Latest Telangana News and National News