JEE topper: పరీక్షకు ముందు యాక్సిడెంట్.. అయినా జేఈఈ టాపర్‌గా..
ABN , Publish Date - Apr 20 , 2025 | 10:23 AM
JEE topper Archisman Nandy: పరీక్షకు మూడు రోజుల ముందు ఆర్కిస్‌మ్యాన్ నాండి కారు ప్రమాదానికి గురయ్యాడు. తల్లిదండ్రులతో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి కుటుంబం మొత్తం ప్రాణాలతో బయటపడింది. ప్రమాదం జరిగిన మూడు రోజులకు ఆర్కిస్‌మ్యాన్ నాండి జేఈఈ మెయిన్ సెసన్ 1 పరీక్ష రాశాడు. 99 శాతం స్కోర్ చేశాడు.

జీవితంలో మనకు ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు. అది అక్షరం సత్యం. జేఈఈ టాపర్ ఆర్కిస్‌మ్యాన్ నాండి జీవితమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. జేఈఈ మెయిన్ పరీక్షకు ముందు అతడు యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ప్రమాదం అంటే చిన్న ప్రమాదం కాదు. పెద్ద ప్రమాదమే. కారు బాగా దెబ్బతింది. ఆ దేవుడి దయ వల్ల ఆ ప్రమాదం నుంచి అతడితో పాటు అతడి కుటుంబం కూడా క్షేమంగా బయటపడింది. యాక్సిడెంట్ అతడ్ని భయపెట్టలేకపోయింది. అతడు పరీక్ష రాశాడు. సెషన్ 1లో 99 శాతం ఉత్తీర్ణత సాధించాడు. ఇప్పుడు జేఈఈ స్టేట్ టాపర్‌గా నిలిచాడు. కారు యాక్సిండ్ టు జేఈఈ టాపర్‌గా అతడి స్టోరీ గురించి ఓ లుక్ వేస్తే..
పెను కారు ప్రమాదం..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆర్కిస్‌మ్యాన్ నాండి జేఈఈ మెయిన్ పరీక్ష కోసం ఎంతో కష్టపడి చదివాడు. అతడి తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రోత్సాహం అందించారు. జనవరి 29న జేఈఈ మెయిన్ సెసన్ 1 పరీక్ష ఉండింది. జనవరి 26న ఆర్కిస్‌మ్యాన్ నాండి కుటుంబం కారులో కోల్‌కతా బయలు దేరింది. హౌరాలోని అంకుర్హతి దగ్గర వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం తీవ్రత కారణంగా కారు బాగా దెబ్బతింది. అయితే, దేవుడి దయవల్ల లోపల ఉన్న ఆర్కిస్‌మ్యాన్ నాండితో పాటు అతడి తల్లిదండ్రులకు కూడా ఏమీ కాలేదు. అంత పెద్ద ప్రమాదం జరిగినా .. చిన్న గాయాలు కూడా కాకుండా బయటపడ్డారు.
యాక్సిడెంట్ జరిగిన తర్వాత మూడో రోజు.. జనవరి 29న ఆర్కిస్‌మ్యాన్ నాండి జేఈఈ మెయిన్ సెసన్ 1 పరీక్షలో పాల్గొన్నాడు. చక్కగా పరీక్షపూర్తి చేశాడు. అందులో 99.98757 శాతం సాధించాడు. జేఈఈ మెయిన్ సెసన్ 2లో కూడా అతడు తన సత్తా చాటాడు. 100 శాతంతో స్టేట్ టాపర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఆర్కిస్‌మ్యాన్ నాండి మాట్లాడుతూ.. ‘ నాకు ఫిజిక్స్, మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. నేను ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదవాలని అనుకుంటున్నా. బీటెక్ తర్వాత రీసెర్చ్ చేస్తాను’ అని అన్నాడు.
ఇవి కూడా చదవండి
Baba Vanga: ప్రపంచానికి పెను ప్రమాదం.. బాబా వంగ జోష్యం నిజం కానుందా
Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈ రోజు ధరలు ఎంతంటే..