Share News

JEE Advanced 2025: సోమవారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

ABN , Publish Date - Jun 01 , 2025 | 07:25 AM

JEE Advanced 2025: భారతీయ సాంకేతిక సంస్థ (IIT) కాన్పూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. అభ్యర్థులు తమ ఫలితాలను https://jeeadv.ac.in/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

JEE Advanced 2025: సోమవారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు
JEE Advanced 2025 Results..

JEE Advanced 2025: భారతీయ సాంకేతిక సంస్థ (IIT) కాన్పూర్ (Kanpur) ఆధ్వర్యంలో నిర్వహించిన జేఈఈ (JEE) అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష ఫలితాలు (Advanced results 2025) సోమవారం (Monday) విడుదల కానున్నాయి. అభ్యర్థులు IIT కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్ https://jeeadv.ac.in/ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. పరీక్షకు హాజరైనవారు ఫలితాల గురించి తాజా సమాచారం తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండాలి. ఈ లింక్ ద్వారా ఫలితాన్ని నేరుగా పరిశీలించవచ్చు.


కాగా ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఐటీ కాన్పుర్‌ ఆ రోజు ఉదయం 10 గంటలకు ర్యాంకులను వెల్లడించనుంది. 1.80 లక్షల మంది పరీక్ష రాసినట్లు సమాచారం. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ఉంటారని తెలియవచ్చింది. గత ఏడాది అడ్వాన్స్‌డ్‌లో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్‌ మార్కుల ఆధారంగా మొత్తం 48,248 మందికి జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు. గత విద్యా సంవత్సరం (2024-25) 23 ఐఐటీల్లో 17,760 సీట్లు అందుబాటులో ఉన్నాయి. జూన్‌ 3వ తేదీ (మంగళవారం) సాయంత్రం 5 గంటల నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది. ఈసారి ఆరు విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ఐఐటీ కాన్పుర్‌ షెడ్యూల్‌ కూడా విడుదల చేసింది.

Also Read: 20 రోజుల్లో 9సార్లు చెప్పారు..


కాగా JEE అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష మే 18న రెండు సెషన్‌లలో నిర్వహించారు. మొదటిది ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, రెండవది మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు అధికారులు నిర్వహించారు. మరోవైపు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ JEE అడ్వాన్స్‌డ్ 2025 (పేపర్ 1, పేపర్ 2 ) ప్రాథమిక కీని మే 25న విడుదల చేసిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

టెన్త్‌ పేపర్లు ఎత్తుకుపోయిన జగన్‌

పెంగ్విన్‌ నిర్వాహకురాలు స్వాతి అరెస్ట్‌

For More AP News and Telugu News

Updated Date - Jun 01 , 2025 | 07:25 AM