ISRO CMS 03 Satellite: CMS-03 శాటిలైట్ ప్రయోగానికి సర్వం సిద్ధం
ABN , Publish Date - Oct 28 , 2025 | 09:12 AM
ఇస్రో ఇప్పటి వరకు ఎన్నో శక్తివంతమైన ఉప్రగహాలను నింగిలో ప్రవేశ పెట్టింది. తాజాగా అత్యంత బరువైన ఉపగ్రహాలను మోసుకెళ్లే లాంచ్ వెహికల్ మార్క్-3(ఎల్‌వీఎం–3) రాకెట్ మరోసారి ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది.
శ్రీహరి కోట, అక్టోబర్ 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటికే అనేక ప్రయోగాలను నిర్వహించింది. ఎన్నో శక్తివంతమైన ఉప్రగహాలను నింగిలో ప్రవేశ పెట్టింది. తాజాగా అత్యంత బరువైన ఉపగ్రహాలను మోసుకెళ్లే లాంచ్ వెహికల్ మార్క్-3(ఎల్‌వీఎం–3) రాకెట్ మరోసారి ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్‌లోని ప్రయోగ వేదికపై నుంచి సీఎంఎస్–03(CMS 03 satellite) ఉపగ్రహాన్ని నవంబర్ 2న ప్రయోగించనున్నారు. ఈ శాటిలెంట్ ను అమర్చిన ఎల్‌వీఎం–3 రాకెట్‌ను శ్రీహరి కోటకు ఆదివారం తరలించారు.
భారత్ సహా విశాలమైన సముద్ర ప్రాంతంలో కమ్యూనికేషన్(communication satellite) సేవలు అందించే లక్ష్యంతో మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ఎల్‌వీఎం3–ఎం5(satellite launch India) రాకెట్ సాయంతో కక్షలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. పౌర, వ్యూహాత్మక, నావికా సేవలను సీఎంఎస్–03 ఉపగ్రహం అందివ్వనుంది. ఈ ఉపగ్రహం బరువు ఏకంగా 4,400 కేజీలు. భారత్ భూభాగంపై నుంచి భూ స్థిర కక్షలోకి ఇంతటి బరువైన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడం ఇదే ప్రథమం. గతంలో చంద్రయాన్–3(Chandrayaan 3 rocket) మిషన్ కార్యక్రమం కోసం ఎల్‌వీఎం–3 రాకెట్‌ను వినియోగించారు. ఈ రాకెట్‌ను ఇప్పటిదాకా నాలుగుసార్లు ఉపయోగించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్‌లో బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ