సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
ABN , Publish Date - Jul 17 , 2025 | 06:16 AM
పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. సిరియా రాజధాని డమాస్క్‌సలోని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం, సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది.

ముగ్గురు మృతి, 34 మందికి గాయాలు
టెల్ అవీవ్, డమాస్కస్, జూలై 16: పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. సిరియా రాజధాని డమాస్క్‌సలోని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం, సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ముగ్గురు మృతిచెందగా 34 మంది గాయపడ్డారు. సిరియా అధ్యక్ష భవనానికి అత్యంత సమీపంలోనే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బలగాలు ఈ దాడులు జరపడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సిరియా సువేదా ప్రాంతంలోని మైనారిటీ షియా తెగకు చెందిన ద్రూజ్ జాతీయులకు మద్దతుగా ఈ దాడులు జరిపినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
వాస్తవానికి 4 రోజుల క్రితం ద్రూజ్ జాతీయులకు, సున్నీ బెడ్విన్ తెగ మధ్య సాయుధ ఘర్షణ ప్రారంభమైంది. ఈ ఘర్షణలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో ద్రూజ్ జాతీయులను కాపాడేందుకు ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మంది ద్రూజ్ జాతీయులు ఉండగా సిరియాలో సగం మంది ఉన్నారు.