Share News

IRCTC: టికెట్ బుకింగ్ కోసం IRCTC కొత్త యాప్..

ABN , Publish Date - May 25 , 2025 | 07:42 PM

ఆండ్రాయిడ్, iOS వినియోగదారుల కోసం IRCTC కొత్త మొబైల్ యాప్ 'స్వారైల్'ను ప్రారంభించింది. SwaRail యాప్‌లో టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలి? దాని ఫీచర్లు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

IRCTC: టికెట్ బుకింగ్ కోసం IRCTC కొత్త యాప్..
Swarail

IRCTC 'స్వారైల్' అనే కొత్త టికెట్ బుకింగ్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఇప్పుడు Android, iOS వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ యాప్ రైలు ప్రయాణ ప్రణాళిక, ప్రత్యక్ష రైలు ట్రాకింగ్, ఫుడ్ ఆర్డరింగ్‌తో అనేక లక్షణాలను కలిగి ఉంది. ఈ యాప్‌ను భారతదేశంలో సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) అభివృద్ధి చేసింది. SwaRail యాప్.. భారతీయ రైల్వే సేవలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తెస్తుంది. ఇది ప్రస్తుతం ముందస్తు యాక్సెస్‌లో ఉన్నప్పటికీ, వినియోగదారులు రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఇప్పటికే ఉన్న IRCTC యాప్‌ను ఉపయోగించవచ్చు.


SwaRail యాప్‌లో టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలి?

  • SwaRail యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. మీ ప్రస్తుత IRCTC ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి.

  • హోమ్ స్క్రీన్‌లో 'జర్నీ ప్లానర్' పై క్లిక్ చేసి 'రిజర్వ్డ్' ఆప్షన్‌ను ఎంచుకుని రైలు టిక్కెట్లను బుక్ చేసుకోండి.

  • మీ ప్రయాణ తేదీ, తరగతి, కోటాను నమోదు చేసి, మీరు వెళ్లాల్సిన స్టేషన్ కోసం సర్చ్ చేయండి.

  • అందుబాటులో ఉన్న రైళ్లను చూడండి. మీకు నచ్చినదాన్ని ఎంచుకోండి. మీరు ప్రయాణించాలనుకుంటున్న కోచ్ తరగతిని ఎంచుకోండి.

  • మీ బోర్డింగ్ స్టేషన్‌ను ఎంచుకోండి. ఎంత మంది వెళ్తున్నారో వారి వివరాలను నమోదు చేయండి. 'జర్నీ వివరాలను సమీక్షించండి'పై క్లిక్ చేయండి.

  • తదుపరి స్క్రీన్‌లో, రైలు వివరాలు, ప్రయాణ సమయం, ఛార్జీలను తనిఖీ చేయండి. అవసరమైతే 'ఛార్జీల విభజన'పై క్లిక్ చేయండి.

  • కాావాల్సిన సమాచారన్ని టైప్ చేసి క్యాప్చాను ఎంటర్ చేయండి. UPI, కార్డ్, నెట్-బ్యాంకింగ్ లేదా R-వాలెట్ ద్వారా డబ్బు చెల్లించడానికి 'ఇప్పుడే బుక్ చేయండి'ని క్లిక్ చేయండి.


స్వారైల్ యాప్ ఫీచర్లు

IRCTC ద్వారా వచ్చిన SwaRail యాప్ రైలు ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఇందులో రియల్-టైమ్ రైలు ట్రాకింగ్ ఉంటుంది. ప్రయాణీకులు రైలు ఎక్కడ వరకు వచ్చింది? ఇంకా ఎంత టైం పడుతుంది వంటి వివరాలను తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. కోచ్ పొజిషన్ ఫైండర్ వినియోగదారులు ప్లాట్‌ఫామ్‌లో తమ కోచ్‌ను సులభంగా గుర్తించడంలో సహాయపడుతుంది. 'ఆర్డర్ ఫుడ్ ఆన్ ది గో' ఆప్షన్‌తో ప్రయాణీకులు తమ ప్రయాణ సమయంలో సౌకర్యవంతంగా భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు.

మీకు ప్రయాణంలో ఏదైన సమస్య ఉన్నా, యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా, ఏదైన సహాయం కావాలని ఉన్నా ఈ యాప్‌లొ కోరవచ్చు. ఈ యాప్‌లో మీకు కావాల్సిన భాషను ఎంచుకోవచ్చు.


Also Read:

రష్యాపై డ్రోన్ల దాడులు.. మాస్కోలో ఆపరేషన్ సిందూర్ టీమ్‌కు విచిత్ర అనుభవం

పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్.. సంచలన విషయం బయటపెట్టిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ

For More National News

Updated Date - May 25 , 2025 | 07:42 PM