Share News

Ashwini Vaishnaw: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

ABN , Publish Date - Jul 10 , 2025 | 05:32 PM

ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గుడ్ న్యూస్ చెప్పారు. వెయ్యి కొత్త రైల్వే సర్వీసులను పట్టాలు ఎక్కిస్తున్నట్లు ప్రకటించారు. రైలు ప్రమాదాలు సైతం గణనీయంగా తగ్గాయన్నారు.

Ashwini Vaishnaw: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
Railway Minister Ashwini Vaishnaw

న్యూఢిల్లీ, జులై 10: దేశంలో జనాభా విపరీతంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా ప్రయాణ సౌకర్యాలు పెరగడం లేదంటూ సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదేళ్లలో కొత్తగా వెయ్యి రైళ్లను పట్టాలు ఎక్కించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం న్యూఢిల్లీలో వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో ఈ కొత్త రైల్వే సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. 2027 నాటికి దేశంలో బుల్లెట్ రైలు ప్రారంభించడమే భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. రైల్వే ఎగుమతుల ద్వారా ప్రపంచంలోనే భారత్ కీలక పాత్ర పోషించనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైల్వే ద్వారా సరుకు రవాణా కారణంగా భారీగా ఆదాయం సమకూరనుందని చెప్పారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.


గత 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా 35 వేల కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్‌ను నిర్మించామని వివరించారు. ఇది జర్మనీ దేశంలోని మొత్తం రైల్వే ట్రాక్‌తో సమానమని సోదాహరణగా చెప్పారు. ఒక్క ఏడాదిలోనే 5,300 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను భారతీయ రైల్వే నిర్మించిందని చెప్పారు. ఏడాదిలో 30 వేల వ్యాగిన్లు, 15 వందల లోకోమోటివ్‌లను భారతీయ రైల్వే తయారు చేస్తుందని పేర్కొన్నారు. ఇది ఉత్తర అమెరికా, యూరప్‌ తయారు చేస్తున్న రైల్వే వ్యాగిన్ల కంటే అధికమన్నారు.


మరోవైపు భారతీయ రైల్వేలో పెట్టబడులు రూ. 2 వేల కోట్ల నుంచి రూ. 2.25 లక్షల కోట్లు ఏగబాకాయని చెప్పారు. అందులో రూ. 20 వేల కోట్లు.. పీపీపీ ద్వారా అదనంగా వచ్చాయని ఆయన వివరించారు. జపాన్ సహకారంతో బుల్లెట్ రైలు తయారు చేస్తున్నామన్నారు. ఇది 2026 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నామని తెలిపారు. 2027లో దీనిని ప్రారంభిస్తామన్నారు.


ఇక ఏడాదిలో రైళ్లు పట్టాలు తప్పిన ఘటనలు 170 నుంచి 30కి తగ్గాయన్నారు. మొత్తంగా పరిశీలిస్తే.. రైలు ప్రమాదాలు 80 శాతం మేర తగ్గాయని వివరించారు. ట్రాకులు అప్ గ్రేడ్ చేయడం.. పాయింట్స్, సిగ్నలింగ్ వ్యవస్థలను ప్రతి రోజు సమీక్షించడం ద్వారా ఈ ప్రమాదాల నివారించడం సాధ్యమైందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 10 , 2025 | 06:15 PM