IAF: భారత వాయుసేన హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
ABN , Publish Date - Jun 13 , 2025 | 04:10 PM
పంజాబ్‌లోని పఠాన్ కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో పైలట్ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

నాంగాల్‌పుర్: భారత వైమానికి దళానికి (IAF) చెందిన అపాచీ హెలికాప్టర్ శుక్రవారం నాడు అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. పంజాబ్‌లోని పఠాన్ కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో నంగాల్‌పుర్ పరిధిలోని హాలెడ్ గ్రామంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అయితే ప్రజా భద్రతకు ఎలాంటి ముప్పు కలగలేదని అధికారులు చెప్పారు. సమాచారం తెలిసిన వెంటనే పలువురు వైమానిక దళ అధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.
దీనికి ముందు, వారం రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో ఐఏఎఫ్ అపాచీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. గత ఏప్రిల్‌లోనూ జామ్‌నగర్‌లోని భారత వాయుసేనకు చెందిన ఓ హెలికాప్టర్ వాతావరణ ప్రతికూలత కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అలాగే ఫిబ్రవరిలో ఐఏఎఫ్‌కు చెందిన మిరాజ్ 2000 ట్విన్ సీటర్ ఫైటర్ జెట్ మధ్యప్రదేశ్‌లోని శివపురిలో కుప్పకూలింది. అయితే ఈ మూడు ఘటనల్లోనూ పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు.
గతేడాది నవంబర్‌లో ఐఏఎఫ్ మిగ్-29 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా సమీపంలోని వ్యవసాయ భూమిలో ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదం.. 10 నిమిషాల గ్యాప్‌లో ఎస్కేప్.. సుడి బాగుంది!
గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి