Kailash Mansarovar Yatra: భారత్-చైనా మధ్య ఒప్పందం కుదిరిందా...కైలాష్ మానసరోవర్ యాత్రపై కీలక అప్‌డేట్..
ABN , Publish Date - Apr 17 , 2025 | 06:26 PM
ప్రముఖ కైలాష్ మానసరోవర్ యాత్రను సంబంధించి భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. కరోనా నుంచి చాలా సంవత్సరాలుగా నిలిపివేయబడిన ఈ యాత్ర త్వరలో తిరిగి సాధారణ ప్రజల కోసం ప్రారంభించబడుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

భారత్, చైనా మధ్య సంబంధాల విషయంలో కొత్త మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన కైలాష్ మానసరోవర్ యాత్ర(Kailash Mansarovar Yatra)ను పునరుద్ధరించేందుకు రెండు దేశాలు కూడా అంగీకరించాయి. ఈ నిర్ణయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం ప్రకటించారు. ఈ క్రమంలో ఈ ఏడాది వేసవిలో కైలాష్ మానసరోవర్ యాత్రను పునరుద్ధరించేందుకు భారత్, చైనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ యాత్ర 2020లో కోరనా మహమ్మారి కారణంగా నిలిపివేయబడింది.
పునరుద్ధరణ కోసం
ఈ యాత్రకు సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించబడతాయి. ఈ యాత్ర పునరుద్ధరణ రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయులతోపాటు అనేక మంది కూడా కైలాష్ మానసరోవర్ యాత్ర పునరుద్ధరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ యాత్రను పునరుద్ధరించడం ద్వారా భక్తులకు మానసిక శాంతితోపాటు ఆధ్యాత్మిక అనుభూతి కలుగనుంది.
రెండు మార్గాల ద్వారా..
జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నిర్వహించే పవిత్ర కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లాలని అనేక మంది భక్తులు భావిస్తుంటారు. హిమాలయాల లోయల్లో ఆధ్యాత్మిక అనుభూతి కోసం వెళ్లాలనే భక్తులకు రెండు అధికారిక మార్గాల ద్వారా ఈ యాత్రను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 1981 నుంచి ప్రారంభమైన ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ మార్గం, ఎప్పటినుంచో భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక 2015లో ప్రారంభమైన సిక్కింలోని నాథులా పాస్ మార్గం కూడా ఇప్పుడు భక్తులకు మరొక పునీతమైన మార్గంగా మారింది. ఈ రెండు మార్గాలు దైవానుభూతిని, ప్రకృతితో మమేకమయ్యే అవకాశాన్ని అందిస్తూ వేలాది మంది యాత్రికులను ఆహ్వానిస్తున్నాయి.
చైనా-భారత్ ఒప్పందం
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య డిసెంబర్ 2024లో జరిగిన సమావేశంలో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నత్తులా సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించేందుకు రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతోపాటు సరిహద్దు ప్రాంతాల్లోని నదులపై సమాచార మార్పిడి, ఇతర సహకారాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. భారత్, చైనా మధ్య ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
ఇవి కూడా చదవండి:
FASTag: ఫాస్ట్‌ట్యాగ్ యుగానికి వీడ్కోలు..మే 1 నుంచి మారనున్న కొత్త విధానం
IMD: ఐఎండీ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో ఏప్రిల్ 19 వరకు భారీ వర్షాలు
WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్ పొందండి..
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Read More Business News and Latest Telugu News