India Reimposes Ban: పాక్ చానెళ్లపై భారత్ మళ్లీ నిషేధం
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:58 AM
పాకిస్థాన్ న్యూస్ చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లపై భారత్ మరోమారు నిషేధం విధించింది.

ఆంక్షల తొలగింపుపై నెటిజన్ల కన్నెర్రతో దిద్దుబాటు
న్యూఢిల్లీ, జూలై 3: పాకిస్థాన్ న్యూస్ చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లపై భారత్ మరోమారు నిషేధం విధించింది. బుధవారం ఆంక్షలు తొలగించడంపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లపై ఆంక్షలు ఎందుకు తొలగించాల్సి వచ్చిందని నెటిజన్లు ప్రశ్నించారు. దీంతో కేంద్రం మళ్లీ నిషేధం విధించింది.
సాంకేతిక సమస్య వల్లే బుధవారం పాక్ సెలబ్రిటీల అకౌంట్లు తిరిగి ప్రత్యక్షమయ్యాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తప్పుడు సమాచారం ప్రసారం చేయడంతో పాటు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ డాన్ న్యూస్, జియో న్యూస్, ఏఆర్‌వై న్యూస్, సమా టీవీ వంటి పాకిస్ధాన్ న్యూస్ చానెళ్లను కేంద్రం నిషేధించింది.