Share News

Indus Treaty Suspension: బగలిహార్ డ్యామ్ నుంచి నీటిని నిలిపివేసిన భారత్

ABN , Publish Date - May 04 , 2025 | 02:45 PM

పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకున్న కిరాతక చర్యలో పాక్ ప్రమేయానికి ఆధారాలను నిర్ధారించిన భారత్ ఇందుకు ప్రతిగా దశబ్దాల క్రితం నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. 1960లో అంతర్జాతీయ అభివృద్ధి పునర్మిర్మాణ బ్యాంకు అయిన ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ మధ్య కుదిరిన నీటి పంపిణీ ఒప్పందమే ఈ సింధు నదీ జలాల ఒప్పందం

Indus Treaty Suspension: బగలిహార్ డ్యామ్ నుంచి నీటిని నిలిపివేసిన భారత్

న్యూఢిల్లీ: సరిహద్దు టెర్రరిజంపై ఉక్కుపాదం మోహిన భారత్ పొరుగుదేశమైన పాక్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయం పాక్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో భాగంగానే చెనాబ్ నదిపై ఉన్న బగలిహార్ డ్యామ్ (Baglihar Dam) నుంచి నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపివేసింది. జీలం నదిపై నిర్మించిన కిషన్ గంగ డ్యామ్ నుంచి కూడా ఇదే తరహాలో నీటిని నిలిపివేసేందుకు సన్నాహకాలు చేస్తోంది.

India Vs Pakistan: భారత్‌తో యుద్ధంపై స్పందించిన పాక్ రాయబారి


పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకున్న కిరాతక చర్యలో పాక్ ప్రమేయానికి ఆధారాలను నిర్ధారించిన భారత్ ఇందుకు ప్రతిగా దశబ్దాల క్రితం నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. 1960లో అంతర్జాతీయ అభివృద్ధి పునర్మిర్మాణ బ్యాంకు అయిన ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ మధ్య కుదిరిన నీటి పంపిణీ ఒప్పందమే ఈ సింధు నదీ జలాల ఒప్పందం. దీనిపై అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, పాక్ ప్రధాని అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఇరు వైరి దేశాల మధ్య శాంతియుత సహకారానికి అరుదైన ఉదాహరణగా ఇది నిలిచింది. 1965, 1971, 1999లో భారత్-పాక్ మధ్య యుద్ధాలు జరిగినా ఈ ఒప్పందం తట్టుకుని నిలిచింది. కానీ ఇప్పుడు ఆ ఒప్పందం నిరవధికంగా రద్దయింది.


కాగా, సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా పాకిస్థాన్‌కు నీటి సరఫరాను ఆపడానికి భారతదేశం ధైర్యం చేస్తే అది పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం కావాల్సి ఉంటుందని పాక్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. భారతదేశంపై అణ్వాయుధాలతో దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్థాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి హెచ్చరించారు. అయితే పహల్గాం ఉగ్రదాడులకు పాల్పడ్డవారని, వారి వెనుక ఉన్న వారిని వేటాడి పట్టుకుంటామని భారత్ హెచ్చరించడంతో పాటు ఇందుకు అవసరమైన లక్ష్యాలు, తేదీ, సమయం నిర్దారించుకునేందుకు సైనిక దళాలకు పూర్తి స్వేఛ్చనిచ్చింది.


ఇవి కూడా చదవండి

Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

For National News And Telugu News

Updated Date - May 04 , 2025 | 03:00 PM